సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ 2024 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగింపు-cbse single girl child scholarship 2024 last date to register extended again ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ 2024 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగింపు

సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ 2024 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగింపు

HT Telugu Desk HT Telugu
Jan 25, 2025 01:01 PM IST

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2024 సంవత్సరానికి సంబంధించిన సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ కోసం రిజిస్ట్రేషన్ గడువును 2025 ఫిబ్రవరి 8 వరకు పొడిగించింది. ఈ స్కాలర్‌షిప్ కింద 10వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ ఫీజుకు ఆర్థిక సహాయం అందుతుంది.

సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2024: రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2024: రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2024 రిజిస్ట్రేషన్ తేదీని మరోసారి పొడిగించింది. బాలికల ఉపకార వేతన పథకానికి రిజిస్ట్రేషన్ గడువును 2025 ఫిబ్రవరి 8 వరకు పొడిగించారు. అభ్యర్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌లో సంబంధిత ప్రకటనను చూడవచ్చు.

yearly horoscope entry point

సిబిఎస్ఇ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ తాజా దరఖాస్తులు, రెన్యువల్ కోసం, ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 8. పాఠశాల ద్వారా దరఖాస్తుల పరిశీలన ఫిబ్రవరి 15, 2025 వరకు జరుగుతుంది.

సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ కోసం ఎలా అప్లై చేయాలి

స్కాలర్‌షిప్‌ స్కీమ్‌కు అప్లై చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.

1. సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.

2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్ లింక్‌పై క్లిక్ చేయండి.

3. అభ్యర్థులకు సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2024 లింక్ ఉన్న కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

4. లింక్‌పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి.

5. ఇప్పుడు అకౌంట్లోకి లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ నింపాలి.

6. సబ్మిట్‌పై క్లిక్ చేసి పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

7. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపరచండి.

సీబీఎస్ఈ 10 వ తరగతి పరీక్షలో 70% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి, తల్లిదండ్రులకు ఏకైక కుమార్తెగా ఉన్న వారుఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. అయితే 11, 12 తరగతుల్లో ట్యూషన్ ఫీజు నెలకు రూ.3 వేలకు మించకూడదన్న నిబంధన ఉంది.

స్కాలర్ షిప్ నెలకు రూ.1000 ఉంటుంది. ఈ పథకం కింద ఇచ్చే స్కాలర్‌షిప్ గరిష్టంగా 2 సంవత్సరాల పాటు చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్