సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..-cbse results 2025 class 10 results out see how to check and download ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి మొత్తం మీద 93.6శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను ఎలా చెక్​ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలపై బిగ్​ అప్డేట్​! మంగళవారం ఉదయం 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన సీబీఎస్​ఈ.. మధ్యాహ్నం 1 గంటకు క్లాస్​ 10 రిజల్ట్స్​ని సైతం ప్రకటించింది. ఫలితాలను ఎలా చెక్​ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు..

2025 సీబీఎస్​ఈ 10వ తరగతి పరీక్షల్లో మొత్తం మీద 93.66శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది ఇది 93.60శాతంగా నమోదైంది. ఈసారి 23,71,939 మంది పరీక్ష రాయగా, వీరిలో 22,21,636 మంది పాసయ్యారు. ఇక అబ్బాయిల కన్నా అమ్మాయిలు మెరుగైన ప్రదర్శన చేశారు. బాలుర పాస్​ పర్సెంటేజ్​ 92.63శాతంగా ఉండగా, బాలికల ఉత్తీర్ణత శాతం (95%..) అబ్బాయిల కన్నా 2.3శాతం అధికంగా ఉంది.

సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు- ఇంటర్నెట్​ అవసరం లేకుండా ఇలా చెక్​ చేసుకోండి..

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలను ఇంటర్నెట్​ అవసరం లేకుండా ఐవీఆర్​ఎస్​ (ఇంటరాక్టివ్​ వాయిస్​ రెస్పాన్స్​ సిస్టెమ్​)తో కూడా చెక్​ చేసుకోవచ్చు. ఎలా అంటే..

స్టెప్​ 1- ఏరియా కోడ్​తో సహా 24300699 నెంబర్​ని కాల్​ చేయండి.

స్టెప్​ 2- వాయిస్​ సేవల ద్వారా విద్యార్థులు సబ్జెక్టు వారీగా మార్కులను వినొచ్చు.

ఎస్​ఎంఎస్​ ద్వారా ఇలా చెక్​ చేసుకోండి..

స్టెప్​ 1- కొత్త మెసేజ్​ ఓపెన్​ చేయండి.

స్టెప్​ 2- cbse10roll no for CBSE Class 10 result టైప్​ చేయండి.

స్టెప్​3- 7738299899 కి మెసేజ్​ పంపండి.

స్టెప్​ 4- సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు మొబైల్​ నెంబర్​కి వస్తాయి.

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు- ఆన్​లైన్​లో అధికారిక వెబ్​సైట్​లో ఇలా చెక్​ చేసుకోండి..

  1. అధికారిక వెబ్సైట్ (cbse.gov.in)లోకి వెళ్లండి. "రిజల్ట్స్​" ట్యాబ్​పై క్లిక్ చేయండి.

2. సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాల లింక్ మీద ట్యాప్ చేయండి.

3. మీ లాగిన్ క్రెడెన్షియల్స్- అంటే రోల్ నెంబర్, స్కూల్ నెంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ ఫిల్​ చేయండి.

4. రిజల్ట్స్​ని వీక్షించడానికి “సబ్మిట్” బటన్​పై క్లిక్​ చేయండి.

5. మీ ఫలితాలు స్క్రీన్​పై కనిపిస్తాయి. భవిష్యత్ రిఫరెన్స్ కోసం డౌన్​లోడ్ చేసుకోండి.

సీబీఎస్​ఈ 10వ తరగతి బోర్డు పరీక్ష ఫిబ్రవరి 15న ప్రారంభమై, మార్చ్​ 1, 2025న ముగిసింది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష 2025 ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగింది.అన్ని రోజులూ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సింగిల్ షిఫ్ట్​లో పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది 10, 12వ తరగతి పరీక్షల కోసం సుమారు 44 లక్షల మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం