సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..-cbse result 2025 class 12 result out see how to check and download ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ రోల్ నంబర్, ఇతర ఆధారాలను ఉపయోగించి అధికారిక వెబ్సైట్లలో తమ స్కోర్లను చెక్ చేసుకోవచ్చు.

సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల (Sudipta Banerjee | ANI)

సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్స్​లో తమ సీబీఎస్​ఈ ఫలితాలను చెక్​ చేసుకోవచ్చు. సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు ఈ రోజు 1 గంటకు విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు బోర్డు పరీక్షల ఫలితాలను ఎలా చెక్​ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు..

ఈ సంవత్సరం మొత్తం 1704367 మంది అభ్యర్థులు సీబీఎస్​ఈ 12వ తరగతి పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా, 1692794 మంది హాజరయ్యారు. వీరిలో మొత్తం 1496307 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం మీద చూసుకుంటే ఈసారి ఉత్తీర్ణత శాతం 88.39 శాతం.

“బాలురు కన్నా బాలికలు (91పర్సెంట్​) 5 కన్నా ఎక్కువ పర్సెంటేజ్​ పాయింట్లతో ముందంజలో ఉన్నారు. ఈసారి 88.39శాతం మంది పాసయ్యారు. గతేడాదితో పోల్చుకుంటే ఇది స్వల్ప వృద్ధి,” అని ఎగ్జామినేషన్​ కంట్రోలర్​ సన్యం భరద్వాజ్​ తెలిపారు.

సీబీఎస్​ఈ ఫలితాలు 2025- ఈ క్రెడెన్షియల్స్​ అవసరం..

సీబీఎస్​ఈ 10వ తరగతి, సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలను చెక్​ చేసుకునేందుకు అవసరమైన లాగిన్ క్రెడెన్షియల్స్​.. రోల్ నెంబర్, పాఠశాల నెంబర్, సెంటర్ నెంబర్, పుట్టిన తేదీ (డీఓబీ).

అధికారిక వెబ్​సైట్స్​ జాబితా ఇది..

  1. results.cbse.nic.in
  2. cbseresults.nic.in
  3. results.digilocker.gov.in

సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాల డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సీబీఎస్​ఈ 12 తరగతి ఫలితాలను ఇలా చెక్​ చేసుకోండి..

సీబీఎస్​ఈ 10, 12వ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఈ కింద ఇచ్చిన స్టెప్స్​ ఫాలో అయ్యి రిజల్ట్స్​ని చూసుకోవచ్చు.

స్టెప్​ 1: అధికారిక సీబీఎస్​ఈ వెబ్సైట్​ని సందర్శించండి.

స్టెప్ 2: "సీబీఎస్​ఈ 10 వ ఫలితాలు 2025 లింక్" లేదా "సీబీఎస్​ఈ 12వ ఫలితాలు 2025 లింక్" మీద క్లిక్​ చేయండి.

స్టెప్ 3: రోల్ నెంబర్, స్కూల్ నెంబర్, పుట్టిన తేదీ, సెంటర్ నెంబర్ ఇచ్చి సబ్మీట్​ మీద క్లిక్ చేయాలి.

స్టెప్ 4: సీబీఎస్​ఈ 10 వ తరగతి ఫలితాలు 2025 / సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు 2025 మార్క్​షీట్​ చూపించే కొత్త పేజీ కనిపిస్తుంది.

స్టెప్ 5: డిజిటల్ స్కోర్​కార్డ్​ని చెక్​ చేసి డౌన్​లోడ్​ చేసి, ప్రింటౌట్​ తీసుకొని, హార్డ్ కాపీని భవిష్యత్తు రిఫరెన్స్ కోసం ఉంచుకోండి.

సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు-: డిజిలాకర్​లో ఎలా చెక్​ చేసుకోవాలి?

స్టెప్​ 1- డిజిలాకర్ అధికారిక వెబ్సైట్ చూడండి: digilocker.gov.in.

స్టెప్​ 2- మీకు అవసరమైన ఆధారాలతో లాగిన్ చేయండి లేదా మీకు ఇప్పటికే ఒకటి లేకపోతే కొత్త ఖాతా కోసం సైన్ అప్ చేయండి.

స్టెప్​ 3- సీబీఎస్ఈ రిజల్ట్స్ విభాగానికి వెళ్లండియ ఇది సాధారణంగా "ఎడ్యుకేషన్" లేదా "రిజల్ట్స్" ట్యాబ్ కింద ఉంటుంది.

స్టెప్​ 4- సూచనల ప్రకారం మీ సీబీఎస్ఈ రోల్ నెంబర్, స్కూల్ నెంబర్, ఇతర అవసరమైన వివరాలను పేర్కొనండి.

స్టెప్​ 5- వివరాలు ఇచ్చిన తర్వాత 10వ తరగతి లేదా 12వ తరగతి ఫలితాలను చూడవచ్చు.

2025 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు నిర్వహించిన ఈ క్లాస్​ 10, క్లాస్​ 12 పరీక్షలకు 42 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. డిజిలాకర్, ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ కాల్, ఉమాంగ్ యాప్ వంటి వివిధ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా విద్యార్థులు తమ డిజిటల్ మార్క్​షీట్​ని యాక్సెస్ చేసుకోవచ్చు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం