CBSE Recruitment 2025: సీబీఎస్ఈలో 212 పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ; ఇలా అప్లై చేసుకోండి!
సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 212 సూపరింటెండెంట్, జేఏ పోస్టులను సీబీఎస్ఈ భర్తీ చేయనుంది. ఈ పోస్ట్ లకు సీబీఎస్ఈ వెబ్సైట్ cbse.gov.in ద్వారా దఖాస్తు చేసుకోవచ్చు.
CBSE Recruitment 2025: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ cbse.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ (recruitment) డ్రైవ్ ద్వారా సంస్థలో 212 పోస్టులను భర్తీ చేయనున్నారు.
లాస్ట్ డేట్..
దరఖాస్తుకు చివరి తేదీ- 2025 జనవరి 31 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.
- ముందుగా సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ cbse.gov.in ను ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న సీబీఎస్ఈ రిక్రూట్మెంట్ 2025 లింక్ పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆ పేజీలో రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాలి.
- అనంతరం, సబ్మిట్ పై క్లిక్ చేసి అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి.
- అప్లికేషన్ ఫామ్ నింపి ఫీజు చెల్లించాలి.
- సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
అప్లికేషన్ ఫీజు
ఈ పోస్ట్ లకు అప్లై చేసే అన్ రిజర్వ్ డ్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు ఒక్కో పోస్టుకు రూ.800 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్ సర్వీస్ మెన్/ మహిళలు/ డిపార్ట్ మెంటల్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. డెబిట్ కార్డులు (రూపే/వీసా/మాస్టర్ కార్డ్/మాస్ట్రో), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
నియామక ప్రక్రియ
సూపరింటెండెంట్ పోస్టుకు ఎంపిక ప్రక్రియలో రెండు అంచెల పరీక్ష, ఆ తర్వాత స్కిల్ టెస్ట్ (క్వాలిఫయింగ్ స్వభావం) ఉంటాయి. ఆబ్జెక్టివ్ (ఎంసీక్యూ) టైప్ (ఓఎంఆర్ బేస్డ్) టైర్-1 పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను టైర్-2 రాత (డిస్క్రిప్టివ్) పరీక్షకు అనుమతిస్తారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపిక ప్రక్రియలో టైర్-1 (ఎంసీక్యూ) పరీక్ష ఉంటుంది. టైర్-1 (ఎంసీక్యూ) పరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో స్కిల్ టెస్ట్ (క్వాలిఫయింగ్ నేచర్)కు పిలుస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీబీఎస్ఈ (cbse) అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.