CBSE hall ticket : సీబీఎస్​ఈ క్లాస్​ 10, క్లాస్​ 12 పరీక్షలపై అప్డేట్​! హాల్​ టికెట్లు వచ్చేశాయి..-cbse hall ticket 2025 class 10 12 admit cards out at pariksha sangam portal ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Cbse Hall Ticket : సీబీఎస్​ఈ క్లాస్​ 10, క్లాస్​ 12 పరీక్షలపై అప్డేట్​! హాల్​ టికెట్లు వచ్చేశాయి..

CBSE hall ticket : సీబీఎస్​ఈ క్లాస్​ 10, క్లాస్​ 12 పరీక్షలపై అప్డేట్​! హాల్​ టికెట్లు వచ్చేశాయి..

Sharath Chitturi HT Telugu
Feb 03, 2025 12:32 PM IST

CBSE hall ticket 2025: సీబీఎస్​ఈ క్లాస్​ 10, క్లాస్​ 12 హాల్​ టికెట్లు విడుదలయ్యాయి. వీటిని పాఠశాలలు డౌన్​లోడ్​ చేసి, విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సీబీఎస్​ఈ క్లాస్​ 10, క్లాస్​ 12 పరీక్షలపై అప్డేట్​!
సీబీఎస్​ఈ క్లాస్​ 10, క్లాస్​ 12 పరీక్షలపై అప్డేట్​! (Official website, screenshot)

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) క్లాస్​ 10, క్లాస్​ 12 బోర్డు పరీక్షలపై కీలక అప్డేట్​! పరీక్షా సంఘం పోర్టల్​లో ఆయా పరీక్షలకు సంబంధించిన అడ్మిట్​ కార్డులు/ హాల్​ టికెట్​లు విడుదలయ్యాయి. పాఠశాలలు బోర్డు వెబ్​సైట్​ cbse.gov.in లోకి వెళ్లి పోర్టల్లోకి లాగిన్ అయి తమ విద్యార్థుల హాల్​ టికెట్లను డౌన్​లోడ్​ చేసుకోవాలి.

విద్యార్థులు సీబీఎస్​ఈ హాల్​ టికెట్లను డౌన్​లోడ్​ చేసుకోలేరు! ఆయా స్కూల్స్​ మాత్రమే సీబీఎస్ఈ​ పోర్ట్​లలో హాల్​ టికెట్లను డౌన్​లోడ్​ చేసి విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది.

సీబీఎస్ఈ అడ్మిట్ కార్డు 2025ని డౌన్​లోడ్​ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సీబీఎస్ఈ హాల్​ టికెట్​ 2025: ఇలా డౌన్​లోడ్​ చేసుకోవాలి..

  1. cbse.gov.in. వెబ్​సైట్​లోకి వెళ్లండి.

2. పరీక్షా సంఘం పోర్టల్ తెరవండి.

3. తర్వాతి పేజీలో 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి.

4. స్కూల్స్​ సెలెక్ట్​ చేసుకోండి (గంగ).

5. ప్రీ ఎగ్జామ్ యాక్టివిటీస్ ట్యాబ్ ఓపెన్ చేయండి.

6. మెయిన్ ఎగ్జామ్ 2025 కోసం అడ్మిట్ కార్డు, సెంటర్ మెటీరియల్ లింక్ ఓపెన్ చేయండి.

7. లాగిన్ వివరాలు ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్​లోడ్​ చేసుకోండి.

సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. పదో తరగతి ఫైనల్ పరీక్షలు మార్చి 18న, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4న ముగుస్తాయి. ఉదయం 10.30 గంటల నుంచి ఈ రెండు తరగతుల పరీక్షలు సింగిల్ షిఫ్టుల్లో జరుగుతాయి.

ఈ ఏడాది దేశవిదేశాల్లోని 8,000 పాఠశాలలకు చెందిన 44 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్​ఈ క్లాస్​ 10, 12వ పరీక్షలకు హాజరుకానున్నారు.

డ్రెస్ కోడ్, ఎగ్జామ్ హాల్లోకి అనుమతించే/ నిషేధించిన వస్తువులు, మాల్​ప్రాక్టీసెస్, జరిమానాల గురించి బోర్డు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.

పరీక్షా కేంద్రాల్లోకి వీటికి మాత్రమే అనుమతి..

  • రెగ్యులర్ విద్యార్థులకు: అడ్మిట్ కార్డు, స్కూల్ ఐడెంటిటీ కార్డు
  • ప్రైవేటు అభ్యర్థులకు: అడ్మిట్ కార్డు, ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్
  • స్టేషనరీ వస్తువులు: ట్రాన్స్​పరెంట్​ పౌచ్, జామెట్రీ/ పెన్సిల్ బాక్స్, బ్లూ/ రాయల్ బ్లూ ఇంక్/ బాల్ పాయింట్/ జెల్ పెన్, స్కేల్, రైటింగ్ ప్యాడ్, ఎరేజర్.
  • అనలాగ్ వాచ్, ట్రాన్స్​పరెంట్​ వాటర్ బాటిల్.
  • మెట్రో కార్డు, బస్​పాస్, డబ్బులు.

హాల్ లోపల వీటికి అనుమతి లేదు..

  • స్టేషనరీ ఐటమ్స్: టెక్స్ట్ మెటీరియల్ (ప్రింటెడ్ లేదా రాతపూర్వక), పేపర్ బిట్స్, కాలిక్యులేటర్, పెన్ డ్రైవ్, లాగ్ టేబుల్ (కేంద్రాలే ఇస్తాయి), ఎలక్ట్రానిక్ పెన్, స్కానర్ మొదలైనవి. డైస్కాల్క్యులియా ఉన్న విద్యార్థులు పరీక్షా కేంద్రం అందించిన కాలిక్యులేటర్లను వాడుకోవాల్సి ఉంటుంది.
  • కమ్యూనికేషన్ పరికరం: మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్​ఫోన్స్, మైక్రోఫోన్, పేజర్, హెల్త్ బ్యాండ్, స్మార్ట్​వాచ్, కెమెరా మొదలైనవి.
  • ఇతర వస్తువులు: వాలెట్, కళ్లజోళ్లు, హ్యాండ్ బ్యాగులు, పౌచ్​లు మొదలైనవి.
  • డయాబెటిక్ విద్యార్థులు మినహా ఏదైనా తినదగిన వస్తువు (తెరిచిన లేదా ప్యాక్ చేసిన).
  • మాల్​ప్రాక్టీసెస్​ కిందకు వచ్చే ఇతర వస్తువులు.

సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్ డ్రెస్​కోడ్ ప్రకారం రెగ్యులర్ విద్యార్థులు తప్పనిసరిగా స్కూల్ యూనిఫాం ధరించాలి, ప్రైవేట్ విద్యార్థులు లైట్​ దుస్తులు ధరించవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం