సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు మే 13న విడుదల అయ్యాయి. ఈ పరీక్షల్లో బాలుర కంటే బాలికలు మెరుగైన ఫలితాలు సాధించారు. వారి ఉత్తీర్ణతా శాతం బాలుర కన్నా ఐదు శాతానికి పైగా అధికంగా ఉంది. అలాగే, మొత్తంగా, 90 శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గిందని బోర్డు ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ మంగళవారం తెలిపారు.
సీబీఎస్ఈ 12వ తరగతిలో గత ఏడాది 87.98 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 88.39 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది సీబీఎస్ఈ 12 వ తరగతి ఫలితాల్లో బాలికలు 91.64 శాతం ఉత్తీర్ణ సాధించగా, బాలురు 85.70 శాతం ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్ జెండర్ అభ్యర్థులు గత ఏడాది 50 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈసారి రెట్టింపు ఉత్తీర్ణత సాధించారు.
ఈ సంవత్సరం సీబీఎస్ఈ 12వ తరగతిలో 1,11,544 మంది అభ్యర్థులు 90 శాతానికి పైగా మార్కులు సాధించారు. 24,867 మంది అభ్యర్థులు 95 శాతానికి పైగా మార్కులు సాధించారు. గతేడాది 12వ తరగతిలో 1.16 లక్షల మంది విద్యార్థులు 90 శాతానికి పైగా, 24,068 మంది 95 శాతానికి పైగా మార్కులు సాధించారు. 90 శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థుల్లో 290 మంది ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు ఉన్నారు. ఈ కేటగిరీలో 55 మంది విద్యార్థులు 95 శాతానికి పైగా మార్కులు సాధించారు.
ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు 16,92,794 మంది పరీక్షకు హాజరుకాగా, 1.29 లక్షల మందికి పైగా కంపార్ట్మెంటల్ పరీక్షకు హాజరయ్యారు. గత ఏడాది 1.22 లక్షలతో పోలిస్తే ఈ సంఖ్య స్వల్పంగా పెరిగింది. విజయవాడ రీజియన్ లో అత్యధికంగా 99.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, త్రివేండ్రంలో 99.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రయాగ్ రాజ్ రీజియన్ లో అత్యల్పంగా 79.53 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పాఠశాలల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు అత్యధికంగా 99.9 శాతం ఉత్తీర్ణత సాధించగా, అత్యల్పంగా ప్రైవేటు లేదా స్వతంత్ర పాఠశాలలు 87.94 శాతం ఉత్తీర్ణత సాధించాయి. విదేశీ పాఠశాలల్లో గత ఏడాది 95.84 శాతంగా ఉన్న ఉత్తీర్ణత శాతం ఈసారి 95.01 శాతానికి తగ్గింది.
సంబంధిత కథనం