సీబీఎస్ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ 2025 షెడ్యూల్ ఇదే-cbse class 10 12 supplementary exam 2025 datesheet released check schedule here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  సీబీఎస్ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ 2025 షెడ్యూల్ ఇదే

సీబీఎస్ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ 2025 షెడ్యూల్ ఇదే

Anand Sai HT Telugu

సీబీఎస్ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ 2025 షెడ్యూల్ విడుదలైంది. జులై 15 నుంచి పరీక్షలు మెుదలుకానున్నాయి.

సీబీఎస్ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు cbse.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూల్‌ను చూసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం 2025 జూలై 15 నుండి 22 వరకు సీబీఎస్ఈ 10 వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష 2025 జరుగుతాయి. చాలా పేపర్లకు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. మరికొన్నింటికి ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

సీబీఎస్ఈ 10వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్
సీబీఎస్ఈ 10వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్
సీబీఎస్ఈ 10వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్
సీబీఎస్ఈ 10వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్

సీబీఎస్ఈ 12వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ 2025 జూలై 15న జరగనుంది. చాలా సబ్జెక్టులకు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, మరికొన్ని సబ్జెక్టులకు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. 12వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ 2025 షెడ్యూల్ ఇలా ఉంది.

సీబీఎస్ఈ 12వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్
సీబీఎస్ఈ 12వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్
సీబీఎస్ఈ 12వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్
సీబీఎస్ఈ 12వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలను మే 13, 2025న ప్రకటించింది. 12వ తరగతిలో 17.04 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 16.92 లక్షల మంది హాజరయ్యారు. మొత్తం 14.96 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 88.39 శాతంగా నమోదైంది. అదేవిధంగా పదో తరగతిలో 23.85 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 23.71 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 22.21 లక్షల మంది ఉత్తీర్ణత సాధించగా, మొత్తం ఉత్తీర్ణత శాతం 93.66 శాతంగా నమోదైంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.