CBSE Board Exam 2025 : సీబీఎస్ఈ పరీక్షల్లో కఠిన రూల్స్- ఇలా చేసి దొరికిపోతే 4ఏళ్లు ఎగ్జామ్స్ రద్దు..!
సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 విద్యార్థులకు అలర్ట్! పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కి సంబంధించి 5 కేటగిరీల్లో రూల్స్ తీసుకొచ్చింది సీబీఎస్ఈ. తప్పు చేసి దొరికిపోతే, ఏకంగా 4ఏళ్ల పాటు పరీక్షలను రద్దు చేస్తామని తేల్చిచెప్పింది.
సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు అలర్ట్! పరీక్షల సమయంలో పాటించాల్సిన ఎథిక్స్ అండ్ రూల్స్‌కి సంబంధించిన గైడ్‌లైన్స్‌ని తెలుసుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాలలకు సూచనలతో పాటు అనుమతి- నిషేధిత వస్తువుల జాబితాను ప్రకటించింది. వీటిల్లో మాల్‌ప్రాక్టీస్‌కి సంబంధించి చాలా కఠినమైన రూల్స్ ఉన్నాయి. తప్పు చేసి దొరికిపోతే ఏకంగా 4ఏళ్ల పాటు పరీక్ష రద్దు అయ్యే విధంగా రూల్స్‌ని తీసుకొచ్చింది సీబీఎస్ఈ. విద్యార్థులు వీటిని తెలుసుకోవడం చాలా అవసరం. పూర్తి వివరాలు..

సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్- ఇలా చేస్తే పరీక్షలు రద్దు..!
సీబీఎస్ఈ ఈ మాల్‌ప్రాక్టీస్‌లను నాలుగు కేటగిరీలుగా విభజించింది.
మొదటి కేటగిరీ..
సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 పరీక్షల్లో గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు కలిగి ఉండటం, సమాధాన పుస్తకం కాకుండా ఇతర అంశాలపై ప్రశ్నలు, సమాధానాలు రాయడం, సమాధాన పుస్తకం లేదా అనుబంధ సమాధాన పుస్తకం పేజీలను చింపడం, పరీక్ష సమయంలో సిబ్బంది కాకుండా మరెవరినైనా సంప్రదించడం / కమ్యూనికేట్ చేయడం లేదా సంప్రదించడానికి / కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించడం.
వీటిల్లో ఏ ఒక్కటి చేసినా, ప్రస్తుత ఏడాది పరీక్ష రద్దు అవుతుంది. అర్హత ఉంటే కంపార్ట్మెంట్ పరీక్షలో ఆ సబ్జెక్టును రాసేందుకు అభ్యర్థిని అనుమతిస్తారు.
ఒకవేళ ఎవిడెన్స్‌లు లేకపోతే మాత్రం.. విద్యార్థులకు ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద అవకాశం ఇవ్వడం జరుగుతుంది.
రెండో కేటగిరీ..
దరఖాస్తు చేసుకోవడానికి అడ్మిట్ కార్డుపై ఫ్యాబ్రికేటెడ్ ఫోటోలను అతికించడం / అప్లోడ్ చేయడం, సీబీఎస్ఈ సమాధాన పుస్తకం (లు) పై ముద్రించిన ఏదైనా సమాచారాన్ని తుడిచివేయడం లేదా తొలగించడం, సమాధాన పత్రంలో తప్పుడు సమాచారాన్ని అందించడం, కాపీయింగ్ మెటీరియల్ కలిగి ఉండటం, దానిని ఉపయోగించడం, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మరొక విద్యార్థి లేదా అసిస్టెంట్ సూపరింటెండెంట్‌తో కమ్యూనికేట్ చేయడం, మరొక విద్యార్థి అక్రమాలకు పాల్పడటానికి సహాయపడటం, ఇతర విద్యార్థులకు ఏదైనా విధంగా సహాయం చేయడం లేదా అలా చేయడానికి ప్రయత్నించడం, మరొక విద్యార్థి నుంచి సహాయం తీసుకోవడం.
ఈ పరిస్థితుల్లో అన్ని సబ్జెక్టులకు ప్రస్తుత పరీక్షను రద్దు చేసి, మరుసటి ఏడాది పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు.
మూడో కేటగిరీ..
జవాబు పత్రాన్ని పరీక్ష హాల్/గది/కేంద్రం నుంచి తీసుకెళ్లడం, ప్రశ్నాపత్రాన్ని (పాక్షికంగా లేదా పూర్తిగా) పరీక్ష హాల్ వెలుపల స్మగ్లింగ్ చేయడం, జవాబు పుస్తకాలు/సప్లిమెంటరీ జవాబు పత్రాన్ని స్మగ్లింగ్ చేయడం, పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించిన తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాలను కలిగి ఉండటం, ఉపయోగించడం లేదా ఉపయోగించడానికి ప్రయత్నించడం, అసభ్య పదజాలం ఉపయోగించడం, విధుల్లో ఉన్న సిబ్బందిని బెదిరించడం, పరీక్ష కేంద్రంలో పరీక్ష సమయంలో లేదా తరువాత హింసకు పాల్పడటం, పరీక్షా కేంద్రం లేదా హాల్లోకి/బయటకు బలవంతంగా ప్రవేశించడం లేదా నిష్క్రమించడం.
ఇలాంటి ఉల్లంఘనలకు ప్రస్తుత, వచ్చే ఏడాది పరీక్షలను రద్దు చేయడమే శిక్ష!
నాలుగొవ కేటగిరీ..
పరీక్షను తారుమారు చేయడం (పరీక్ష రాయడానికి వేరొకరిని ఉంచడం వంటివి), పరీక్షకు సంబంధించి ఏదైనా సోషల్ మీడియాలో పంచుకోవడం, పరీక్షలో అనధికారిక సౌలభ్యం కోసం వ్యక్తులు, తమకు అనుకూలంగా ప్రయోజనం పొందడానికి సీబీఎస్ఈని ప్రభావితం చేయడానికి చట్టపరమైన కోర్సు లేదా మరేదైనా మార్గాన్ని తీసుకోవడం (తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా).
ఈ పరిస్థితుల్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రస్తుత పరీక్ష సహా వచ్చే మూడేళ్లు, అంటే మొత్తం మీద 4ఏళ్లు పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేయనుంది.
ఐదొవ కేటగిరీ..
సమాధాన పుస్తకంలో అశ్లీల / అవమానకరమైన భాషను ఉపయోగించడం, మూల్యాంకకులకు సమాధాన పుస్తకంలో బెదిరింపు భాషను ఉపయోగించడం, హాని కలిగించే భాషను ఉపయోగించడం, అనుమతించిన వాటికి కాకుండా ఇతర సమాధానాలు రాయడానికి సిరా లేదా పెన్సిల్ ఉపయోగించడం, సమాధాన పుస్తకంతో కరెన్సీ నోటు లేదా ఇతర పరికరాన్ని జతచేయడం.
అలాంటి అభ్యర్థుల పరీక్షలను రద్దు చేస్తామని బోర్డు చెప్పలేదు. భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో ఆన్సర్ బుక్‌లో ఇలాంటి భాషను ఉపయోగించకుండా కమిటీ ఇలాంటి అభ్యర్థులకు కౌన్సిలింగ్ ఇస్తుందని తెలిపింది.
కరెన్సీ నోట్లను జప్తు చేసి బోర్డు ఖాతాలో జమ చేస్తారు.
సంబంధిత కథనం