CA Final exams : ఇక నుంచి ఏడాదికి మూడుసార్లు సీఏ ఫైనల్​ ఎగ్జామ్స్​..-ca final exams to be conducted thrice a year from 2025 icai ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ca Final Exams : ఇక నుంచి ఏడాదికి మూడుసార్లు సీఏ ఫైనల్​ ఎగ్జామ్స్​..

CA Final exams : ఇక నుంచి ఏడాదికి మూడుసార్లు సీఏ ఫైనల్​ ఎగ్జామ్స్​..

Sharath Chitturi HT Telugu

CA final 3 times a year : ఇంటర్మీడియట్, ఫౌండేషన్ కోర్సు పరీక్షలను సంవత్సరానికి మూడుసార్లు నిర్వహించాలని గత ఏడాది ఐసీఏఐ నిర్ణయం తీసుకుందని. ఇప్పుడు సీఏ ఫైనల్ పరీక్షలు కూడా ఏడాదికి మూడుసార్లు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

సీఏ విద్యార్థులకు గుడ్​ న్యూస్​! (Pixabay)

సీఏ (ఛార్టర్డ్​అ అకౌంటెంట్) అభ్యర్థులకు గుడ్​ న్యూస్​! సీఏ ఫైనల్ పరీక్షలను ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు కాకుండా, మూడుసార్లు నిర్వహిస్తామని ఇన్​స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తాజాగా ప్రకటించింది. ఇది 2025 నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

ఐసీఏఐ కీలక నిర్ణయం..

ఇంటర్మీడియట్, ఫౌండేషన్ కోర్సు పరీక్షలను సంవత్సరానికి మూడుసార్లు నిర్వహించాలని గత ఏడాది ఐసీఏఐ నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు సీఏ ఫైనల్ పరీక్షలు కూడా అదే బాటలో నడుస్తాయని ఐసీఏఐ తెలిపింది.

“ప్రపంచ ఉత్తమ విధానాలకు అనుగుణంగా, విద్యార్థులకు ఎక్కువ అవకాశాలను అందించడానికి, సీఏ ఫైనల్ పరీక్షను సంవత్సరానికి మూడుసార్లు నిర్వహించాలని ఐసీఏఐ 26వ కౌన్సిల్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు జరిగేది,” అని ఐసీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇకపై సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్, ఫౌండేషన్ అనే మూడు స్థాయిల్లోనూ ప్రతి ఏటా సమాన సంఖ్యలో అంటెప్ట్స్​ జరుగుతాయని, దీని వల్ల విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. ఈ పరీక్షలను జనవరి, మే, సెప్టెంబర్ నెలల్లో నిర్వహిస్తామని వెల్లడించారు.

పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్సు ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టెమ్స్ ఆడిట్​లో కూడా మార్పులు జరుగుతాయని ఐసీఏఐ తెలిపింది.

గతంలో ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబర్ నెలల్లో) నిర్వహించే ఈ కోర్సు అసెస్మెంట్ టెస్ట్​ని ఇకపై ఏడాదికి మూడుసార్లు (ఫిబ్రవరి, జూన్, అక్టోబర్) నిర్వహిస్తామని, ఇది సభ్యులకు ప్రాప్యతను, సౌలభ్యాన్ని మరింత పెంచుతుందని ఐసీఏఐ తెలిపింది.

దేశంలో ఉన్న అత్యంత కఠినమైన పరీక్షల్లో సీఏ ఫైనల్స్​ ఒకటి. దీని కోసం విద్యార్థులు చాలా కష్టపడుతుంటారు. ఈ తరుణంలో సీఏ ఫైనల్స్​ని మూడుసార్లు నిర్వహించాలన్న ఐసీఏఐ నిర్ణయం విద్యార్థులకు కచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్స్​లో అందుబాటులో ఉంది. కెరీర్ సంబంధిత లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం వాట్సాప్​లో హెచ్​టీ తెలుగు ఛానెల్​ని ఫాలో అవ్వండి..

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం