BRO Recruitment 2025 : పది పాసైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు.. BROలో రిక్రూట్‌మెంట్.. ఇలా అప్లై చేయండి
BRO Recruitment 2025 : బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO)లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. పది పాస్ అయిన యువత ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం..
ప్రభుత్వ ఉద్యోగం కోసం చూసేవారికి గుడ్‌న్యూస్. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO)లో వివిధ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. దరఖాస్తు ప్రక్రియ 11 జనవరి 2025 నుండి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 24 ఫిబ్రవరి 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, లడఖ్, లాహౌల్ స్పితి, హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా సబ్ డివిజన్ పాంగి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌ల అభ్యర్థులు 11 మార్చి 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
411 ఖాళీలు
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ఈ రిక్రూట్‌మెంట్ జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ కింద జరుగుతుంది. ఇందులో ప్రస్తుత, బ్యాక్‌లాగ్‌కు సంబంధించి ఖాళీలు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 411 ఖాళీలు విడుదలయ్యాయి. ఈ పోస్టుల్లో 153 ఎంఎస్‌డబ్ల్యూ (కుక్), 172 ఎంఎస్‌డబ్ల్యూ (Mason), 75 ఎంఎస్‌డబ్ల్యూ (Blacksmith) పోస్టులు, 11 ఎంఎస్‌డబ్ల్యూ (మెస్ వెయిటర్) పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
BRO రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసేవారు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇది కాకుండా కొన్ని నిర్దిష్ట పోస్ట్‌లకు ఇతర విద్యా అర్హతలు ఉండవచ్చు. అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ అధికారిక నోటిఫికేషన్ marvels.bro.gov.inలో చూడాలి.
అర్హతలు
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు నుంచి గరిష్ట వయస్సు 25 సంవత్సరాలుగా నిర్ణయించింది. అయితే నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులు రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ప్రాక్టికల్ టెస్ట్ (ట్రేడ్ టెస్ట్), మెడికల్ ఎగ్జామినేషన్ వంటి వివిధ దశల తర్వాత ఎంపిక అవుతారు.
ఫీజు వివరాలు
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.50 చెల్లించాలి, అయితే ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. అధికారిక SBI పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయాలి. దరఖాస్తుకు తప్పనిసరిగా ఇ-రసీదు కాపీని జోడించాలి.
పోస్ట్ ద్వారా పంపాలి
దరఖాస్తు తప్పనిసరిగా నిర్ణీత ఫార్మాట్‌లో ఇంగ్లీష్ లేదా హిందీలో A4 పరిమాణ కాగితంపై సమర్పించాలి. అభ్యర్థులు ఇటీవలి పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోగ్రాఫ్‌ను అతికించాలి. చిరునామా, అర్హత ప్రమాణాలతో సహా అన్ని వివరాలు కచ్చితంగా ఉన్నాయని చూసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తులు, అవసరమైన పత్రాలు, రుసుము రసీదుతో పాటు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. పంపించాల్సిన అడ్రస్ : GREF, సెంట్రల్, డిగ్గీ క్యాంప్, అలండి రోడ్, పూణే-411015.
సంబంధిత కథనం