BRAOU BEd Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ ప్రవేశాలు - ఈ వారంలోనే ఎంట్రెన్స్ ఫలితాలు, కౌన్సెలింగ్ ఎప్పుడంటే-braou bed entrance test 2024 results will be released in january first week 2025 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Braou Bed Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ ప్రవేశాలు - ఈ వారంలోనే ఎంట్రెన్స్ ఫలితాలు, కౌన్సెలింగ్ ఎప్పుడంటే

BRAOU BEd Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ ప్రవేశాలు - ఈ వారంలోనే ఎంట్రెన్స్ ఫలితాలు, కౌన్సెలింగ్ ఎప్పుడంటే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 01, 2025 12:06 PM IST

BRAOU B.Ed Admissions Updates: అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఎంట్రెన్స్ రాత పరీక్ష పూర్తి కాగా.. ఈ వారంలోనే ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక జనవరి మూడో వారంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ ప్రవేశాలు
అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ ప్రవేశాలు

హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ((ODL -Open and Distance Learning)) ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. 2024-25 అకడమిక్ ఇయర్ కు సంబంధించి ఈ ప్రవేశాలను కల్పించనున్నారు. డిసెంబర్ 31, 2024వ తేదీన ఎంట్రెన్స్ పరీక్ష కూడా జరిగింది. అయితే ఎంట్రెన్స్ ఫలితాలు, కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు.

yearly horoscope entry point

ఈ వారంలోనే ఎంట్రెన్స్ ఫలితాలు…

బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు జనవరి మొదటి వారంలో విడుదల కానున్నాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://www.braouonline.in/Home.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా… ర్యాంక్ కార్డులను పొందవచ్చు.

మూడో వారంలో కౌన్సెలింగ్….

మొదటి వారంలో ఫలితాలను ప్రకటించిన తర్వాత.. జనవరి మూడో వారంలో కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు సీట్లు కేటాయించనున్నారు. https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి కౌన్సెలింగ్ తేదీలతో పాటు మిగతా వివరాలను చూడొచ్చు.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..?

  • బీఈడీ ఎంట్రెన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • BRAOU BEd Entrance Test 2024 Results లింక్ పై నొక్కాలి.
  • ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
  • మీ ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం