హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ(ODL -Open and Distance Learning)) ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవలనే ఎంట్రెన్స్ పరీక్ష కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా… 2024-25 అకడమిక్ ఇయర్ కు సంబంధించి ఈ ప్రవేశాలను కల్పించనున్నారు. అయితే ఈ రాత పరీక్షకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు.
అంబేడ్కర్ వర్శిటీ బీఈడీ ఎంట్రెన్స్ పరీక్ష ప్రాథమిక కీని అధికారులు విడుదల చేశారు. అంతేకాదు.. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. కీపై అభ్యంతరాలు ఉంటే.. జనవరి 8వ తేదీలోపు పంపాల్సి ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. https://www.braouonline.in/Home.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా… ర్యాంక్ కార్డులను పొందవచ్చు.
రాత పరీక్ష ఫలితాలను ప్రకటించిన తర్వాత.. జనవరి మూడో వారంలో కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు. https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి కౌన్సెలింగ్ తేదీలతో పాటు మిగతా వివరాలను చూడొచ్చు.