BRAOU MBA Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో ఎంబీఏ అడ్మిషన్లు - ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ జారీ, వివరాలివే
ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత పరీక్ష ఆధారంగా హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ కోర్సులో అడ్మిషన్లు ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంట్రెన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్, కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దారుస్సలాం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ కోర్సును నిర్వహించనున్నాయి.

దరఖాస్తులు ప్రారంభం…
జనవరి 15వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఎంట్రన్స్ టెస్ట్‌కు ఫిబ్రవరి 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని యూనివర్శిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 2వ తేదీన అర్హత పరీక్ష ఉంటుంది. https://braouonline.in/ లింక్ తో అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.
మార్చి 2వ తేదీన ఎగ్జామ్….
దరఖాస్తు చేసుకునే ఓబీసీ అభ్యర్థులు రూ. 1500 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. 500 ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 25వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 2వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఎగ్జామ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటుంది. మార్చి 4వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. మార్చి 10,11 తేదీల్లో అడ్మిషన్ కౌన్సెలింగ్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఇక ఏమైనా సందేహాలు ఉంటే 7382929570, 7382929580 నెంబర్లను సంప్రదించవచ్చు. ఎంట్రెన్స్ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. 200 మార్కులు కేటాయించారు. 90 నిమిషాల సమయం ఇచ్చారు. సెక్షన్ ఏ, బీ, సీలుగా విభజించి ప్రశ్నలు అడుగుతారు. కోర్సు వ్యవధి చూస్తే రెండేళ్లు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు నాలుగు సెమిస్టర్లు రాయాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం