BRAOU BEd Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ ప్రవేశాలు - ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల, త్వరలోనే కౌన్సెలింగ్..!
BRAOU BEd Admissions Updates : హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే కౌన్సలింగ్ షెడ్యూల్ విడుదల కానుంది.
హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ(ODL -Open and Distance Learning)) ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవలనే ఎంట్రెన్స్ పరీక్ష కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫలితాలను అధికారులు తాజాగా విడుదల చేశారు.
ఈ ఎంట్రెన్స్ నోటిఫికేషన్ లో భాగంగా 2024-25 అకడమిక్ ఇయర్ కు సంబంధించి ఈ ప్రవేశాలను కల్పించనున్నారు. పరీక్ష రాసిన అభ్యర్థులు అంబేడ్కర్ వర్శిటీ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
ర్యాంక్ కార్డు ఎలా చెక్ చేసుకోవాలంటే..?
- బీఈడీ ఎంట్రెన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://www.braouonline.in/Home.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే BRAOU BEd ODL 2024 ఆప్షన్ పై లింక్ పై నొక్కాలి.
- ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ Download Your BED-ODL 2024 Rank Card లింక్ పై క్లిక్ చేయాలి.
- బీఈడీ -ODL హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి. వ్యూ ర్యాంక్ కార్డుపై క్లిక్ చేస్తే ర్యాంక్ కార్డు ఓపెన్ అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
త్వరలోనే కౌన్సెలింగ్…!
రాత పరీక్ష ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో.. త్వరలోనే కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు. https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి కౌన్సెలింగ్ తేదీలతో పాటు మిగతా వివరాలను చూడొచ్చు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. జనవరి మూడో వారంలోనే కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. కానీ ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్ల విడుదల తర్వాత అభ్యంతరాలను స్వీకరించారు. వీటిని పరిశీలించిన తర్వాత… తాజాగా ఫలితాలను ప్రకటించారు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. ఎంట్రెన్స్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో…. ఏ క్షణమైనా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.
ఈ లింక్ పై క్లిక్ చేసి నేరుగా బీఈడీ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు
అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో ఎంబీఏ అడ్మిషన్లు:
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంట్రెన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్, కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దారుస్సలాం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ కోర్సును నిర్వహించనున్నాయి.
- ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఎంట్రన్స్ టెస్ట్‌కు ఫిబ్రవరి 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని యూనివర్శిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
- దరఖాస్తు చేసుకునే ఓబీసీ అభ్యర్థులు రూ. 1500 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి.
- 500 ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 25వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది.
- మార్చి 2వ తేదీన అర్హత పరీక్ష ఉంటుంది.
- మార్చి 4వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
- మార్చి 10,11 తేదీల్లో అడ్మిషన్ కౌన్సెలింగ్ ఉంటుంది.
- https://braouonline.in/ లింక్ తో అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్