బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ; టెంత్ పాస్ అయితే చాాలు; ఈ డైరెక్ట్ లింక్ తో అప్లై చేసుకోండి!-bob office assistant recruitment 2025 apply for 500 posts at bankofbaroda in direct link here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ; టెంత్ పాస్ అయితే చాాలు; ఈ డైరెక్ట్ లింక్ తో అప్లై చేసుకోండి!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ; టెంత్ పాస్ అయితే చాాలు; ఈ డైరెక్ట్ లింక్ తో అప్లై చేసుకోండి!

Sudarshan V HT Telugu

బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్ సైట్ bankofbaroda.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్ (Mint Photo)

బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ bankofbaroda.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 500 పోస్టులను భర్తీ చేయనున్నారు.

లాస్ట్ డేట్ మే 23

బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్ లైన్ లో మే 5న ప్రారంభమై 2025 మే 23న ముగుస్తుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.

అర్హతలు

బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి (ఎస్ఎస్సీ/ మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల స్థానిక భాషలో ప్రావీణ్యం (అంటే అభ్యర్థులు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి). అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థి 01.05.1999 తరువాత 01.05.2007 కంటె ముందు జన్మించి ఉండాలి (రెండు తేదీలు కలుపుకొని).

ఎంపిక ప్రక్రియ

బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ ఈ విధంగా ఉటుంది. మొదట ఆన్ లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్ లైన్ టెస్ట్ లో అర్హత/ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు లోకల్ వెర్నాక్యులర్ లాంగ్వేజ్ టెస్ట్ (లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్) ఉంటుంది. తదుపరి ఎంపిక ప్రక్రియలో పాల్గొని ర్యాంకు జాబితాను రూపొందించడానికి ప్రతి అభ్యర్థి రాత (ఆన్లైన్) పరీక్షలో ప్రతి విభాగంలో కనీస స్కోరు (కటాఫ్) తో పాటు మొత్తం స్కోరు 100లో కనీస స్కోరు (కటాఫ్) పొందాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎక్స్ఎస్, మహిళా అభ్యర్థులకు రూ.100.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం