BITSAT 2025 : బిట్‌శాట్ 2025 రిజిస్ట్రేషన్ డేట్ ఇదే! ఇలా రిజిస్టర్ చేసుకోండి..
BITSAT 2025 Registration Date: బిట్‌శాట్ 2025కి సంబంధించిన రిజిస్ట్రేషన్ డేట్ బయటకు వచ్చింది. డేట్‌తో పాటు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బిట్‌శాట్ 2025 (బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్) కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు అలర్ట్! ఈ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వివరాలు బయటకి వచ్చాయి. బిట్‌శాట్ 2025 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ నెల 21న ప్రారంభమవుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు bitsadmission.com అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు.

బిట్‌శాట్ 2025 వివరాలు..
బిట్స్ పిలానీ నిర్వహించే ఈ బిట్‌శాట్ పరీక్ష.. ఇంజినీరింగ్, సైన్స్, టెక్నాలజీ, ఫార్మసీ, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్తో పాటు వివిధ కోర్సులకు ఎంట్రెన్స్గా పనిచేస్తుంది.
ఇక బిట్‌శాట్ బీటెక్ పేపర్లో 4 సెక్షన్లు ఉంటయి. అవి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ప్రొఫీషియెన్సీ అండ్ లాజికల్ రీజనింగ్, మ్యాథ్స్
ఫిజిక్స్- కెమిస్ట్రీలో 40 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ ప్రొఫీషియెన్సీ- లాజికల్ రీజనింగ్‌లో 15,10 ప్రశ్నలు ఉంటాయి. మాథ్స్‌లో 45 ప్రశ్నలు ఉంటాయి. సరైన సమాధానానికి 3 మార్కులు వస్తాయి. బిట్‌శాట్ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. తప్పు సమాధానానికి ఒక మార్క్ కట్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి.
బిట్‌శాట్ 2025- ఇలా అప్లై చేసుకోండి..
స్టెప్ 1- బిట్‌శాట్ అధికారిక వెబ్‌సైట్‌ని (bitsadmission.com) సందర్శించండి.
స్టెప్ 2- హోం పేజ్‌లో "Please Click Here to apply for BITSAT-2025" link అనే లింక్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3- ఇన్స్ట్రక్షన్స్ని పూర్తిగా చదవండి. "Allow me to apply online" ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 4- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. బిట్‌శాట్ 2025కి రిజిస్టర్ చేసుకోండి. లాగిన్ క్రిడెన్షియల్స్ జనరేట్ అవుతాయి.
స్టెప్ 5- అన్ని డాక్యుమెంట్స్‌ని అప్లోడ్ చేయండి. బిట్‌శాట్ అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
స్టెప్ 6- అప్లికేషన్ ఫామ్‌ని సబ్మీట్ చేయండి. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్‌కాపీని తీసిపెట్టుకోండి.
స్టెప్ 7 బిట్‌శాట్ 2025 పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్ డేట్‌పై ఇంకా క్లారిటీ లేదు. కాగా పరీక్షలో క్వాలిఫై అయిన వారు కౌన్సిలింగ్‌కి ఎంపికవుతారు. అడ్మిట్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న వారికి సీట్లు అలాట్ అవుతాయి. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారు.. తదుపరి కౌన్సిలింగ్ రౌండ్స్ ఫలితాల కోసం ఎదురుచూడాలి.
సంబంధిత కథనం