Bill Gates: ‘ఈ కెరీర్ లకు తిరుగులేదు; ఏఐ కూడా వీటిని ఏం చేయలేదు’ అంటున్న బిల్ గేట్స్-bill gates predicts these 3 careers will survive the ai revolution ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Bill Gates: ‘ఈ కెరీర్ లకు తిరుగులేదు; ఏఐ కూడా వీటిని ఏం చేయలేదు’ అంటున్న బిల్ గేట్స్

Bill Gates: ‘ఈ కెరీర్ లకు తిరుగులేదు; ఏఐ కూడా వీటిని ఏం చేయలేదు’ అంటున్న బిల్ గేట్స్

Sudarshan V HT Telugu

Bill Gates: కృత్రిమ మేధ కారణంగా ప్రస్తుతం అనేక ఉద్యోగాలు కనుమరుగు అవుతున్నాయి. భవిష్యత్తులో అనేక రంగాలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ బారిన పడనున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే, మూడు కెరీర్ లు ఏఐ వల్ల ఏ మాత్రం ప్రభావితం కావని బిల్ గేట్స్ చెబుతున్నారు. ఆ కెరీర్ లు ఏంటంటే?

ఈ కెరీర్ లకు తిరుగులేదు

Bill Gates: జాబ్ మార్కెట్ పెద్ద మార్పును ఎదుర్కొంటోంది. ఖర్చులను తగ్గించడానికి, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి కృత్రిమ మేధస్సు (AI) ను అనేక వ్యాపారాలు ఉపయోగిస్తున్నాయి. ఏఐ కారణంగా అనేక ఉద్యోగాలు కనుమరుగు అవుతున్నాయి. ఏఐ వల్ల తమ ఉద్యోగాలు కూడా పోతాయేమోనన్న భయంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, ఏఐ ప్రభావం పడని మూడు కెరీర్ ఆప్షన్స్ ను మైక్రోసాఫ్ట్ ఫౌండర్, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ సూచిస్తున్నారు. అవేంటంటే..

కోడర్స్

‘కోడ్ జనరేట్ చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రావీణ్యం పెరుగుతోంది. అయినప్పటికీ, వ్యవస్థలను పర్యవేక్షించడానికి, లోపాలను పరిష్కరించడానికి, మరింత అధునాతన పరిష్కారాలను రూపొందించడానికి మానవ నైపుణ్యం అవసరమవుతుంది. అది నిష్ణాతులైన కోడర్స్ మాత్రమే చేయగలరు’ అని బిల్ గేట్స్ నొక్కి చెప్పారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కూడా ఈ కోడర్స్ పై ఆధారపడే పరిస్థితి ఉంటుందని తెలిపారు.

బయాలజిస్ట్

బయాలజీ రంగంలో, డేటా విశ్లేషణ, రోగనిర్ధారణ కోసం వైద్య పరిశోధనలో కృత్రిమ మేధస్సు ఇప్పటికే ఒక సాధనంగా ఉపయోగించబడుతుంది. అయినప్పటికీ, అద్భుతమైన శాస్త్రీయ ఆవిష్కరణలకు అవసరమైన సృజనాత్మక సామర్థ్యం ఇప్పటికీ లేదు. ‘‘వ్యాధి నిర్ధారణ, డీఎన్ఏ విశ్లేషణ వంటి రంగాలలో ఏఐ సహాయపడుతుంది. అయినా, ఏఐ జీవశాస్త్రవేత్తలను భర్తీ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండదు. అందువల్ల అధునాతన సామర్ధ్యాలున్న బయాలజిస్ట్ లకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది’’ అని గేట్స్ పేర్కొన్నారు.

ఎనర్జీ ఎక్స్ పర్స్ట్

పూర్తి ఆటోమేషన్ సాధ్యం కాని మరో రంగం ఎనర్జీ రంగమని బిల్ గేట్స్ తెలిపారు. ‘‘చమురు, అణు, పునరుత్పాదక ఇంధనం వంటి పరిశ్రమలు సహజంగా సంక్లిష్టమైనవి. మౌలిక సదుపాయాలను నిర్వహించడానికి ఆవిష్కరణలను నడపడానికి ఇంజనీర్లు, పరిశోధకులు, సాంకేతిక నిపుణుల నుండి వ్యూహాత్మక పర్యవేక్షణ అవసరం’’ అని ఆయన వివరించారు. ఈ రంగంలో ఎనర్జీ ఎక్స్ పర్ట్స్ స్థానాన్ని కృత్రిమ మేధ భర్తీ చేయలేదని బిల్ గేట్స్ అన్నారు.

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం