భారత్ పెట్రోలియంలో ఉద్యోగాలు.. ఇందులో ఏడాదికి రూ.16.5 లక్షల ప్యాకేజీతో జాబ్-bharat petroleum corporation recruitment 2025 for various posts annual salary 16 5 lakh check more ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  భారత్ పెట్రోలియంలో ఉద్యోగాలు.. ఇందులో ఏడాదికి రూ.16.5 లక్షల ప్యాకేజీతో జాబ్

భారత్ పెట్రోలియంలో ఉద్యోగాలు.. ఇందులో ఏడాదికి రూ.16.5 లక్షల ప్యాకేజీతో జాబ్

Anand Sai HT Telugu

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేక పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా అప్లై చేసుకోవచ్చు.

భారత్ పెట్రోలియంలో ఉద్యోగాలు

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL)లో ఉద్యోగం కావాలనుకునేవారికి గుడ్‌న్యూస్. కంపెనీ జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్‌తో సహా అనేక పోస్టులకు నియామకాలను ప్రకటించింది. వివిధ రంగాలలో చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు బీపీసీఎల్ అధికారిక వెబ్‌సైట్ bharatpetroleum.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎవరు దేనికి అప్లై చేసుకోవచ్చు?

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్)

మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, సివిల్ లేదా కెమికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్)

బి.టెక్, బిఇ లేదా బిఎస్సీ (ఇంజనీరింగ్) ఉన్న యువత ఈ పోస్టుకు అర్హులు.

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్స్)

ఇంటర్ సీఏ లేదా ఇంటర్ సీఎంఏతో గ్రాడ్యుయేషన్ తప్పనిసరి.

అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ అస్యూరెన్స్)

ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ లేదా అనలిటికల్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ(కెమిస్ట్రీ) ఉండాలి.

సెక్రటరీ

ఈ పోస్టుకు అప్లై చేసుకునేవారికి గ్రాడ్యుయేషన్‌ ఉండాలి.

వయస్సు

ఈ పోస్టులకు కనీస వయస్సు 30 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. అయితే, ఓబీసీ, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఇస్తారు.

ఎంత జీతం ఇస్తారు?

జూనియర్ ఎగ్జిక్యూటివ్ జీతం: నెలకు రూ. 30,000 నుండి రూ. 1,20,000(వార్షిక ప్యాకేజీ దాదాపు రూ. 11.86 లక్షలు)

అసోసియేట్ ఎగ్జిక్యూటివ్: నెలకు రూ. 40,000 నుండి రూ. 1,40,000(వార్షిక ప్యాకేజీ దాదాపు రూ. 16.64 లక్షలు)

ఎంపిక విధానం

ముందుగా అర్హత, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. దీని తరువాత రాత పరీక్ష నిర్వహిస్తారు. తరువాత కేస్-బేస్డ్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు: 1000 ప్లస్ 180(జీఎస్టీ). ఎస్టీ, ఎస్టీ, PwBDలకు ఎటువంటి రుసుము లేదు.

దరఖాస్తు విధానం

BPCL వెబ్‌సైట్ bharatpetroleum.inకి వెళ్లండి.

హోమ్‌పేజీలో ఇచ్చిన బీపీసీఎల్ రిక్రూట్‌మెంట్ 2025 లింక్‌పై క్లిక్ చేయండి.

దరఖాస్తు ఫారమ్ నింపి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

ఫీజు చెల్లించి ఫారమ్ సమర్పించండి.

భవిష్యత్ అవసరాల కోసం ఫారమ్ ప్రింటవుట్ తీసుకోండి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్