BEL Recruitment 2025: బీఈఎల్ లో ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ
ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 350 పోస్ట్ లను భర్తీ చేయనుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి ఆఖరు తేదీ 2025జనవరి 31.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు బీఈఎల్ అధికారిక వెబ్సైట్ bel-india.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 350 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు జనవరి 10వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఆఖరు తేదీ జనవరి 31, 2025.
ఖాళీల వివరాలు
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ కింది ఖాళీలను భర్తీ చేయనుంది.
- ఈ-2 గ్రేడ్ లో ప్రొబేషనరీ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 200 పోస్టులు
- ఈ-2 గ్రేడ్ లో ప్రొబేషనరీ ఇంజినీర్ (మెకానికల్): 150 పోస్టులు
అర్హతలు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ప్రొబేషనరీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ (recruitment) కు దరఖాస్తు చేసే యూఆర్/ ఓబీసీ (ఎన్సీఎల్) / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ టెలీకమ్యూనికేషన్/ టెలీకమ్యూనికేషన్/ మెకానికల్ విభాగాల్లో బీఈ/ B.Tech ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అన్ రిజర్వ్ డ్ అభ్యర్థులకు ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుకు గరిష్ట వయోపరిమితి 25 ఏళ్లు.
ఎంపిక విధానం
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ప్రొబేషనరీ ఇంజనీర్ ఎంపిక విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటాయి. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్షకు తాత్కాలికంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ రెండింటిలోనూ జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు 35%, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 30%.
దరఖాస్తు ఫీజు
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(ఎన్సీఎల్) కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1180 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఈఎస్ఎం అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఒకసారి చెల్లించిన అప్లికేషన్ ఫీజు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చెల్లించబడదు. యూఆర్/ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (ఎన్సీఎల్) అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించకపోతే వారి దరఖాస్తును తిరస్కరిస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు బీఈఎల్ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.