BDL Jobs 2025 : మంచి జీతంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ విధానం
BDL Recruitment 2025 : గవర్నమెంట్ ఉద్యోగం కోసం చూస్తున్నవారికి గుడ్‌న్యూస్. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందేందుకు మంచి ఛాన్స్ వచ్చింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో పలు పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది.
రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) ద్వారా అనేక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 49 ఖాళీల పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది మంచి అవకాసం అవుతుంది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

భారత్ డైనమిక్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ మోడ్‌లో 30 జనవరి 2025 నుండి 21 ఫిబ్రవరి 2025 వరకు ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://bdl-india.in/ని సందర్శించాలి.
ఎలా అప్లై చేయాలి
అధికారిక వెబ్‌సైట్ హోమ్ పేజీలో తాజా అప్‌డేట్‌ల లింక్‌పై క్లిక్ చేయండి.
వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్స్- మేనేజ్‌మెంట్ ట్రైనీల రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌కి వెళ్లాలి.
తదుపరి పేజీలో అడిగిన వివరాలను నమోదు చేయండి.
రిజిస్ట్రేషన్ తర్వాత మీరు దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు.
దరఖాస్తు చేసిన తర్వాత కచ్చితంగా ప్రింట్ తీసుకోండి. భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడుతుంది.
అర్హతలు
ప్రభుత్వ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ జారీ చేసిన ఈ ఖాళీ ద్వారా మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎంటీ) 46 పోస్టులు, ఏఎమ్ (లీగల్), ఎస్ఎమ్ (సివిల్), డీజీఎమ్(సివిల్) ఒక్కొక్కటి చొప్పున భర్తీ చేస్తారు. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా BE, B.Tech, MBA, MA, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, ICAI లేదా ICWAI మొదలైనవి ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఇస్తారు. రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాలి. అన్‌రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ(ఎన్‌సీఎల్) కేటగిరీ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. అయితే ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్‌మెన్ వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
శాలరీ వివరాలు
ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతం ఉంటుంది. మేనేజ్‌మెంట్ ట్రైనీకి రూ. 15.91 లక్షల వార్షిక ప్యాకేజీ లభిస్తుంది. ఏఎం పోస్టుకు రూ.15.91 లక్షల వార్షిక ప్యాకేజీ, ఎస్‌ఎం పోస్టుకు రూ.25.26 లక్షల వార్షిక ప్యాకేజీ, డీజీఎం పోస్టుకు రూ.28.37 లక్షల వార్షిక ప్యాకేజీ ఇవ్వనున్నారు.