TG Study Circle Free Coaching : నిరుద్యోగులకు శుభవార్త - పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్, ఇలా దరఖాస్తు చేసుకోండి
TG BC Study Circle : ఉద్యోగ అభ్యర్థులకు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. స్టడీ సర్కిళ్లలో ఫిబ్రవరి 15 నుంచి ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షల కోసం ఉచితంగా కోచింగ్ ఇవ్వనుంది. అర్హులైన వారు ఫిబ్రవరి 9లోపు దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో కోరింది.
తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ అభ్యర్థులకు బీసీ సంక్షేమశాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షల కోసం ఉచిత కోచింగ్ ను ప్రారంభించనుంది. మొత్తం 100 రోజుల పాటు కోచింగ్ ఉంటుందని బీసీ స్టడీ సర్కిల్ డెరైక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తు విధానం….
అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 20వ తేదీ నుంచి ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 9వ తేదీతో దరఖాస్తుల గడువు ముగుస్తుంది. www.tgbcstudycircle.cag.gov.in లింక్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.
అర్హతలు - ఎంపిక విధానం
- తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000గా ఉండాలి.
- పట్టణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల ఆదాయం రూ.2,00,000 మించకూడదు.
- ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటటుంది. రిజర్వేషన్లను కూడా ప్రామాణికంగా తీసుకుంటారు.
- అర్హత గల అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ 12.02.2025 నుండి 14.02.2025 వరకు ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులకు అన్ని బీసీ స్టడీ సర్కిల్ లలో 15 ఫిబ్రవరి నుండి RRB, SSC మరియు బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ కోచింగ్ ప్రారంభమవుతుందని బీసీ స్టడీ సర్కిల్ డెరైక్టర్శ్ శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సంబంధిత కథనం