BoM Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలొ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్; మొత్తం పోస్ట్ లు..
BoM Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్సైట్ bankofmaharashtra.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, అనుభవం తదితర వివరాలను ఇక్కడ చూడండి..
Bank of Maharashtra Officers Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్సైట్ bankofmaharashtra.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 172 పోస్టులను భర్తీ చేయనున్నారు.

లాస్ట్ డేట్ ఫిబ్రవరి 17
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 29న ప్రారంభమవుతుంది. అప్లై చేయడానికి ఆఖరు తేదీ 2025 ఫిబ్రవరి 17. విద్యార్హత, వయోపరిమితి ఇతర వివరాలను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్సైట్ bankofmaharashtra.in లో ఉన్న వివరణాత్మక నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు.
ఎంపిక విధానం
అర్హులైన అభ్యర్థులను రాత పరీక్ష (అవసరమైతే) పర్సనల్ ఇంటర్వ్యూ/ డిస్కషన్ ద్వారా ఎంపిక (recruitment) చేస్తారు. అభ్యర్థి యొక్క అర్హతలు, అనుకూలత/ అనుభవం మొదలైన వాటికి సంబంధించి అర్హులైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం కొరకు బ్యాంక్ మొదట అప్లికేషన్లను ప్రాథమికంగా స్క్రీనింగ్ చేస్తారు. అనంతరం, వ్యక్తిగత ఇంటర్వ్యూ/ డిస్కషన్ లో అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూకు మార్కుల కేటాయింపు 100. ఇంటర్వ్యూలో అర్హత సాధించడానికి అభ్యర్థి కనీసం 50 మార్కులు (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులైతే 45) సాధించాలి.
దరఖాస్తు ఫీజు
దరఖాస్తు ఫీజు యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.1180గా నిర్ణయించారు. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.118/ . ఆన్లైన్ విధానంలో మాత్రమే చెల్లింపులు జరపాలి.
హెల్ప్ లైన్ నెంబరు
ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపడం, ఫీజు/ ఇన్ఫర్మేషన్ ఛార్జీలు చెల్లించడం, ఇంటర్వ్యూ కాల్ లెటర్ తదితర వివరాల కోసం హెల్ప్ డెస్క్ నెంబరు 020-25614561ను సంప్రదించవచ్చు. లేదా bomrpcell@mahabank.co.in కు ఈ మెయిల్ చేయవచ్చు. అభ్యర్థులు ఇమెయిల్ సబ్జెక్టులో "బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 2024-25 ~ ఫేజ్ 2" అని పేర్కొనాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.