Bank of Baroda SO Recruitment 2024: బ్యాంక్ ఆఫ్ బరోడా ఎస్ఓ రిక్రూట్మెంట్ దరఖాస్తు గడువు పొడిగింపు
Bank of Baroda SO Recruitment 2024: స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల గడువును బ్యాంక్ ఆఫ్ బరోడా పొడిగించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జనవరి 27, 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.
Bank of Baroda SO Recruitment 2024: స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల గడువును బ్యాంక్ ఆఫ్ బరోడా పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 27, 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ bankofbaroda.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు.

మొత్తం ఖాళీలు, ఎంపిక ప్రక్రియ
బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ లకు అర్హులైన అభ్యర్థులు జనవరి 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బీఓబీ తెలిపింది. ఈ రిక్రూట్మెంట్ (recruitment) డ్రైవ్ ద్వారా సంస్థలో 1267 మేనేజర్లు, ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపిక ప్రక్రియలో ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ లేదా తదుపరి ఎంపికకు అనువైనదిగా భావించే మరేదైనా పరీక్ష ఉంటుంది. తరువాత ఆన్లైన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల గ్రూప్ డిస్కషన్ మరియు / లేదా ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్ పరీక్షలో 150 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 225. పరీక్ష వ్యవధి 150 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ మినహా ఆన్లైన్ పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.600/- + వర్తించే పన్నులు + పేమెంట్ గేట్ వే ఛార్జీలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎస్ఓ రిక్రూట్మెంట్ 2024 కోసం దరఖాస్తు చేయడానికి అనుసరించాల్సిన దశలు:
- బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ bankofbaroda.in సందర్శించండి.
- హోం పేజీలో ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలను సమర్పించాలి. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి దరఖాస్తు రుసుము చెల్లించాలి.
- మరింత సమాచారం కోసం, అధికారిక వెబ్సైట్ బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ bankofbaroda.in ను సందర్శించండి.