Bank of Baroda Recruitment : బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా పోస్టులు- అప్లికేషన్ ప్రక్రియ షురూ..
Bank of Baroda SO Recruitment : బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టుల వివరాలు, ఎంపిక ప్రాసెస్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బ్యాంక్ ఉద్యోగాలకు అప్లై చేస్తున్న వారికి అలర్ట్! బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ (bankofbaroda.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 1267 మేనేజర్లు, ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషలిస్ట్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 28న ప్రారంభమై 2025 జనవరి 17న ముగుస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్- పోస్టులు..
- డిపార్ట్మెంట్ - రూరల్ అండ్ అగ్రి బ్యాంకింగ్: 200 పోస్టులు
- డిపార్ట్మెంట్ - రిటైల్ లయబిలిటీస్: 450 పోస్టులు
- డిపార్ట్మెంట్ - ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్: 341 పోస్టులు
- డిపార్ట్మెంట్ - ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 9 పోస్టులు
- డిపార్ట్మెంట్ - ఫెసిలిటీ మేనేజ్మెంట్: 22 పోస్టులు
- డిపార్ట్మెంట్ - కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్: 30 పోస్టులు
- డిపార్ట్మెంట్ - ఫైనాన్స్: 13 పోస్టులు
- డిపార్ట్మెంట్ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 177 పోస్టులు
- డిపార్ట్మెంట్ - ఎంటర్ప్రైజ్ డేటా మేనేజ్మెంట్ ఆఫీస్: 25 పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడా 2024 అప్లికేషన్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అర్హత..
ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితికి సంబంధించిన వివరాలను ఈ ఆర్టికల్ చివర ఇచ్చిన నోటిఫికేషన్ లింక్‌ని క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
ఎంపిక విధానం..
ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ లేదా తదుపరి ఎంపిక ప్రక్రియకు అనువైన ఇతర పరీక్ష, తరువాత గ్రూప్ డిస్కషన్ లేదా అభ్యర్థుల ఇంటర్వ్యూ, ఆన్లైన్ పరీక్షలో అర్హత సాధించడం. ఆన్లైన్ పరీక్షలో 150 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 225. పరీక్ష వ్యవధి 150 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ మినహా ఆన్లై పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది.
దరఖాస్తు ఫీజు..
బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్ 2024- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.600/- + వర్తించే పన్నులు + పేమెంట్ గేట్‌వే ఛార్జీలు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి.
ఆన్లైన్ పరీక్ష నిర్వహించినా, చేయకపోయినా, ఇంటర్వ్యూకు అభ్యర్థి షార్ట్‌లిస్ట్ అయినా కాకపోయినా అభ్యర్థి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు/ఇన్ఫర్మేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా 2024కి సంబంధించిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం