Bank of Baroda Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు; అప్లై చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్
బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రొఫెషనల్స్ రిక్రూట్మెంట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను 2025 మార్చి 21న ముగించనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేయని అర్హులైన అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ప్రొఫెషనల్స్ రిక్రూట్మెంట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను బ్యాంక్ ఆఫ్ బరోడా 2025 మార్చి 21న ముగించనుంది. మేనేజీరియల్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా సంస్థలో 518 పోస్టులను భర్తీ చేయనుంది. 2025 ఫిబ్రవరి 19న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ 2025 కోసం దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రొఫెషనల్స్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ క్రింది దశలను అనుసరించడం ద్వారా అప్లై చేయవచ్చు.
- ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న కెరీర్స్ లింక్ పై క్లిక్ చేయండి.
3. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
4. ఆన్లైన్ లింక్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
5. లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
6. తర్వాత అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
7. అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
8. సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
9. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
దరఖాస్తు ఫీజు
దరఖాస్తు ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.100. ఆన్ లైన్ పరీక్ష నిర్వహించినా, నిర్వహించకపోయినా, ఇంటర్వ్యూకు అభ్యర్థి షార్ట్ లిస్ట్ అయినా కాకపోయినా అభ్యర్థి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు/ఇన్ఫర్మేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వాటిని ఉపయోగించి స్క్రీన్ పై అడిగిన సమాచారాన్ని అందించడం ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఆన్లైన్ పేమెంట్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఏవైనా ఉంటే అభ్యర్థులు భరించాలి.
ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్
ఎంపిక ప్రక్రియలో ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ లేదా తదుపరి ఎంపిక ప్రక్రియకు అనువైనదిగా భావించే ఏదైనా వేరే పరీక్ష ఉంటుంది. తరువాత గ్రూప్ డిస్కషన్ మరియు / లేదా ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థి బ్యాంకులో చేరిన తేదీ నుండి 12 నెలల క్రియాశీల సర్వీసు కాలానికి ప్రొబేషన్ లో ఉంటారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.
సంబంధిత కథనం