లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా. అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ దఫా రిక్రూట్మెంట్లో భాగంగా మొత్తం 2500 పోస్టులను బ్యాంక్ ఆఫ్ బరోడా భర్తీ చేయనుంది.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జులై 24, 2025 అని గుర్తుపెట్టుకోవాలి. అర్హత, ఎంపిక ప్రక్రియ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇందులో ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (ఐడీడీ) కూడా ఉంటుంది.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్ర స్థానిక భాషలో (చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం) ప్రావీణ్యం కలిగి ఉండాలి.
అభ్యర్థి వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ లేదా తదుపరి ఎంపిక ప్రక్రియకు సరిపోయే ఏదైనా ఇతర పరీక్ష ఉంటాయి. ఆన్‌లైన్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఆన్‌లైన్ టెస్ట్‌లో 120 ప్రశ్నలు ఉంటాయి. గరిష్ట మార్కులు 120. పరీక్షా సమయం 120 నిమిషాలు.
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (OBC) అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 850/- + పేమెంట్ గేట్‌వే ఛార్జీలు.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 175/- + పేమెంట్ గేట్‌వే ఛార్జీలు.
చెల్లింపును డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / ఇంటర్నెట్ బ్యాంకింగ్ / యూపీఐ మొదలైన వాటిని ఉపయోగించి స్క్రీన్‌పై అడిగిన సమాచారం అందించి చేయవచ్చు.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ని చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం