Bank Of Baroda Recruitment : బ్యాంక్ ఆఫ్ బరోడాలో 146 ఖాళీలు, లక్షల్లో జీతం-నేటి నుంచే దరఖాస్తులు-bank of baroda career opportunities 146 vacancy application start salaries in lakh ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Bank Of Baroda Recruitment : బ్యాంక్ ఆఫ్ బరోడాలో 146 ఖాళీలు, లక్షల్లో జీతం-నేటి నుంచే దరఖాస్తులు

Bank Of Baroda Recruitment : బ్యాంక్ ఆఫ్ బరోడాలో 146 ఖాళీలు, లక్షల్లో జీతం-నేటి నుంచే దరఖాస్తులు

Bank Of Baroda Recruitment : బ్యాంక్ ఆఫ్ బరోడాలో 146 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 26 నుంచి ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ మోడ్ లో ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 146 ఖాళీలు, లక్షల్లో జీతం-నేటి నుంచే దరఖాస్తులు

Bank Of Baroda Recruitment : బ్యాంక్ ఆఫ్ బరోడాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 146 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 15వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. పోస్టులను తగిన విధంగా ఆయన విభాగంలో డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అర్హులైన అభ్యర్థులు https://www.bankofbaroda.in/career లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు -146

  1. డిప్యూటీ డిఫెన్స్‌ బ్యాంకింగ్ అడ్వైజర్‌(డీడీబీఏ)- 01
  2. ప్రైవేట్ బ్యాంకర్‌(రేడియన్స్‌ ప్రైవేట్) - 03
  3. గ్రూప్‌ హెడ్‌- 04
  4. టెరిటోరి హెడ్‌- 17
  5. వెల్త్‌ స్ట్రాటజిస్ట్‌(ఇన్వెస్ట్‌మెంట్ అండ్‌ ఇన్సూరెన్స్‌)- 18
  6. ప్రొడక్ట్‌ హెడ్(ప్రైవేట్ బ్యాంకింగ్‌)- 01
  7. పోర్ట్‌పోలియో రీసెర్చ్‌ అనలిస్ట్‌- 01
  8. సీనియర్ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌- 101
  • డిప్యూటీ డిఫెన్స్‌ బ్యాంకింగ్‌ అడ్వైజర్‌ పోస్టుకు 57 ఏళ్లు, ప్రైవేట్ బ్యాంకర్‌కు 33 నుంచి 50 ఏళ్లు, గ్రూప్‌ హెడ్‌కు 31-45 ఏళ్లు, టెరిటోరి హెడ్‌కు 27-40 ఏళ్లు, సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, వెల్త్‌ స్ట్రాటజిస్ట్‌(ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌), ప్రొడక్ట్‌ హెడ్‌కు 24 నుంచి 45 ఏళ్లు, పోర్ట్‌పోలియో రీసెర్చ్‌ అనలిస్ట్‌కు 22 నుంచి 35 ఏళ్లు వయోపరిమితి నిర్ణయించారు.
  • చివరి తేదీన లేదా అంతకు ముందు ఆన్‌లైన్ మోడ్ ద్వారా ఫీజు జమ చేసినప్పుడు మాత్రమే దరఖాస్తు నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. అభ్యర్థులు తమ భవిష్యత్ సూచన కోసం ఫీజు రసీదు నెంబర్, దరఖాస్తు ఫారమ్ కాపీని భద్రపరుచుకోవాలి.
  • దరఖాస్తు చేసుకునే ముందు, అభ్యర్థులు అర్హత తేదీ నాటికి పోస్ట్ కోసం అన్ని అర్హత ప్రమాణాలను నిర్ధారించుకోవాలి.
  • అభ్యర్థి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో పేర్కొన్న ఈ-మెయిల్ ఐడీ ద్వారా మాత్రమే అన్ని సమాచారం వస్తుంది. కాల్ లెటర్‌లు/ఇంటర్వ్యూ తేదీలు/సలహాలు మొదలైన కమ్యూనికేషన్‌లను స్వీకరించడానికి అభ్యర్థి యాక్టివ్‌గా ఉంచాలి.
  • ఏదైనా సంస్థలో 6 నెలల కంటే తక్కువ అనుభవం, క్లరికల్ కేడర్‌లో అనుభవం ఉన్నవారిని ఈ పోస్టులకు పరిగణించరు.
  • భారతదేశంలో ఎక్కడైనా పనిచేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

వార్షిక వేతనం

  • డిప్యూటీ డిఫెన్స్‌ బ్యాంకింగ్ అడ్వైజర్‌ కు : రూ.18,00,000,
  • ప్రైవేట్ బ్యాంకర్‌ కు : రూ. 14,00,000 - రూ. 25,00,000,
  • గ్రూప్‌ హెడ్‌కు :రూ.16,00,000 - రూ.28,00,000,
  • టెరిటోరి హెడ్‌కు : రూ.14,00,000 - రూ. 25,00,000,
  • సీనియర్ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌కు : రూ.8,00,000 - రూ.14,00,000,
  • వెల్త్‌ స్ట్రాటజిస్ట్‌కు : రూ.12,00,000 - రూ.20,00,000,
  • ప్రొడక్ట్‌ హెడ్‌కు : రూ.10,00,000 - రూ.16,00,000,
  • పోర్ట్ పోలియో అనలిస్ట్‌కు : రూ.6,00,000.

దరఖాస్తు ఫీజు

• జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు- రూ.600

• ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడి, మహిళలకు - రూ.100

అభ్యర్థి అప్‌లోడ్ చేయాల్సిన పత్రాలు

➢ రెజ్యూమ్ (PDF)

➢ పుట్టిన తేదీ రుజువు : 10వ తరగతి మార్కుషీట్/సర్టిఫికేట్ (PDF)

➢ విద్యకు సంబంధించి సర్టిఫికెట్లు : సంబంధిత మార్కుషీట్లు/సర్టిఫికేట్ (PDF) (అన్ని విద్యా ధృవపత్రాలను ఒకే PDFలో స్కాన్ చేయాలి)

➢ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్(PDF)

➢ కులం/వర్గం సర్టిఫికేట్ (PDF)

➢ PWD సర్టిఫికేట్

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్