Bank of Baroda Apprentice Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4 వేల అప్రెంటిస్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్
Bank of Baroda Apprentice Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడా భారీగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. 4 వేల అప్రెంటిస్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ bankofbaroda.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Bank of Baroda Apprentice Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 4000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 19నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 11తో ముగియనుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.
అర్హతలు
ఈ పోస్టుకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లో ఉత్తీర్ణత లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా భారత ప్రభుత్వ అప్రెంటిస్ షిప్ పోర్టల్స్ అంటే నాట్స్ పోర్టల్ https://nats.education.gov.in లో రిజిస్టర్ చేసుకోవాలి. లేదా ఎన్ఏపీఎస్ పోర్టల్ https://www.apprenticeshipindia.gov.in లో అభ్యర్థులు ముందుగా తమను తాము రిజిస్టర్ చేసుకోవాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు ఎన్ఎపిఎస్ / నాట్స్ పోర్టల్లో దరఖాస్తు చేసిన 48 గంటల్లోగా info@bfsissc.com నుండి వారికి ఇమెయిల్ అందుతుంది. తుది "అప్లికేషన్ కమ్ ఎగ్జామినేషన్ ఫారం" నింపమని అందులో ఆహ్వానిస్తారు. దీనిలో అభ్యర్థి తన వ్యక్తిగత డేటా, జిల్లా, కేటగిరీ ఎంపిక, పిడబ్ల్యుబిడి స్థితి, ఇతర వివరాలను నింపాలి. అనంతరం, అవసరమైన పరీక్ష ఫీజును ఆన్లైన్ లో చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ఫీజు
బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియలో ఆన్ లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాష్ట్రంలోని స్థానిక భాష పరీక్ష ఉంటాయి. ఆన్లైన్ పరీక్షలో 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ఆబ్జెక్టివ్ పరీక్షల్లో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉండవు. అభ్యర్థుల పరీక్ష ఫీజు దివ్యాంగులకు రూ.400+జీఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.600+జీఎస్టీ, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఇతర వెనుకబడిన తరగతుల (OBC) అభ్యర్థులకు రూ.800+జీఎస్టీ గా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో పరీక్ష ఫీజు చెల్లించాలి.
సంబంధిత కథనం