Secunderabad Army Public School Jobs : సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు - ఇలా దరఖాస్తు చేసుకోండి
Secunderabad RK Puram Army Public School : టీచింగ్ పోస్టుల భర్తీకి సికింద్రాబాద్ RKపురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ నోటిఫికేషన్ ఇచ్చింది. రెగ్యులర్ ప్రాతిపదికన టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో జనవరి 25, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సికింద్రాబాద్ ఆర్.కె.పురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా…. 2025-2026 అకడమిక్ ఇయర్ కు గాను టీచింగ్ ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. రెగ్యులర్, ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
ఖాళీలు….
ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లో భాగాగం పీజీటీ (ఫైన్ ఆర్ట్), టీజీటీ విభాగంలో ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సోషల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్, సైన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ పీటీఐ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇక పీఆర్‌టీ, హెడ్‌మిస్ట్రెస్, ప్రీ ప్రైమరీ టీచర్స్ పోస్టులను భర్తీ చేస్తారు.
పోస్టులను అనుసరించి డిగ్రీ, బీఈడీ ఉండాలి. సంబంధింత కోర్సుల్లో పాసై ఉండాలి. అంతేకాకుండా సీటెట్ లేదా టెట్ ఉత్తీర్ణత కూడా ఉండాలి. పని చేసిన అనుభవం కూడా ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 40 ఏళ్లలోపు ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి. జనవరి 25,2025 తేదీలోపే అప్లికేషన్లను పంపాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు రుసుంను డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ‘Army Public School RK Puram’ పేరుతో డీడీ కట్టాలి. ఆన్ లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకునే దరఖాస్తు ఫామ్ ను నింపి... "ది ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కే పురం, సికింద్రాబాద్" చిరునామాకు పంపించాలి.
అసంపూర్తిగా ఉండే అప్లికేషన్లను స్వీకరించరని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. అభ్యర్థుల ధ్రువపత్రాలు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. https://apsrkpuram.edu.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ముఖ్య వివరాలు :
- ఉద్యోగ ప్రకటన - ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురం, సికింద్రాబాద్
- ఉద్యోగాలు - టీచింగ్ ఖాళీలు
- దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్
- దరఖాస్తు ఫీజు - రూ. 250
- దరఖాస్తులకు చివరి తేదీ - 25 జనవరి 2025
- దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్ - ది ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కే పురం, సికింద్రాబాద్
- అధికారిక వెబ్ సైట్ - https://apsrkpuram.edu.in/
ఈ లింక్ పై క్లిక్ చేసి నేరుగా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
సంబంధిత కథనం