Hyderabad Army Public School Jobs : గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో నాన్ టీచింగ్ ఖాళీలు - ఇలా దరఖాస్తు చేసుకోండి
APS Golconda Recruitment :హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. 2025-2026 అకడమిక్ ఇయర్ కు గాను నాన్ - టీచింగ్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. రెగ్యులర్, ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో నాన్ టీచింగ్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఈ మేరకు ప్రకటన జారీ అయింది. 2025-2026 అకడమిక్ ఇయర్ కు గాను రెగ్యులర్, ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 25వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ వివరాల ప్రకారం... అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
పోస్టుల వివరాలు…
నోటిఫికేషన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. అడ్మిన్ సూపర్ వైజర్, అకౌంటెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, రిస్పెషనిస్ట్,, లైబ్రేరియన్, సైన్స్ ల్యాబ్ అటెండెంట్, కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్, మల్టీ టాస్కిక్ స్టాఫ్, గార్డెనర్, వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులను బట్టీ విద్యా అర్హతలను నిర్ణయించారు. కొన్ని పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. మరికొన్ని పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు 5 ఏళ్లపాటు పని చేసిన అనుభవం ఉండాలి.
అప్లికేషన్ ప్రాసెస్ ఇలా....
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి. దరఖాస్తు రుసుంను డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ‘Army Public School Golcond, Hyderabad, పేరుతో డీడీ కట్టాలి. ఆన్ లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకునే దరఖాస్తు ఫామ్ ను నింపి... "ది ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, హైదర్ షా కోట, సన్ సిటీ, హైదరాబాద్- 500031" చిరునామాకు పంపించాలి.
అసంపూర్తిగా ఉండే అప్లికేషన్లను తిరస్కరిస్తారు. www.apsgolconda.edu.in. వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫామ్ తో పాటు అర్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, పని చేసిన అనుభవం వివరాలు, ఆధార్ కార్డు జిరాక్స్ కూడా జత చేయాలి.
ఆర్మీ వెల్ఫేర్ స్కూల్, సీబీఎస్ఈ మార్గదర్శకాల ప్రకారం... దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని మాత్రమే ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. ఆ తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నోటిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 040 - 29882249 లేదా 9052823270 మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చు.
ముఖ్య వివరాలు :
ఉద్యోగ ప్రకటన - ఆర్మీ పబ్లిక్ స్కూల్, గోల్కొండ, హైదరాబాద్.
ఉద్యోగాలు - నాన్ టీచింగ్ ఖాళీలు
దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్
దరఖాస్తు ఫీజు - రూ. 250
దరఖాస్తులకు చివరి తేదీ - 25 జనవరి 2025
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్ - ది ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్, గోల్కొండ హైదరాబాద్ -500031
అధికారిక వెబ్ సైట్ - https://www.apsgolconda.edu.in/
సంబంధిత కథనం