APTWREIS Admissions : ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 8వ తరగతి,ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు-అర్హతలు, ఆన్ లైన్ దరఖాస్తులు ఇలా
APTWREIS Admissions : ఏపీలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ఎనిమిదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన గిరిజన బాలబాలికలు మార్చి 2వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
APTWREIS Admissions : ఏపీలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ఎనిమిదో తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని ఏడు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం మార్చి 2వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ఏడో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు... 8వ తరగతి ప్రవేశ పరీక్షకు అర్హులు, 2024-25 విద్యాసంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్ ప్రవేశాలకు అర్హులు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1 లక్షకు మించకూడదు.
సీట్ల వివరాలు
గురుకులం నిర్వహించే ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు గురుకులం అందించే ఉచిత భోజన, వసతి, యూనిఫాం, నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, పరుపు సామగ్రి, వైద్య సంరక్షణ, పరీక్ష రుసుము వంటి అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఇంటర్ ఎంపీసీలో 300 సీట్లు, బైపీసీ 300 సీట్లు, 8వ తరగతిలో 180 సీట్లు ఉన్నాయి.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, డా.అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని గురుకుల విద్యాసంస్థలు-
1. కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ (పీటీజీ), మల్లి
2. స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, విశాఖపట్నం
3. స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, పార్వతీపురం (జోగింపేట)
4. కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, విస్సన్నపేట
గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, నంద్యాల, తిరుపతి చిత్తూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, అనంతపురం జిల్లాల పరిధిలోని గురుకుల విద్యాసంస్థలు -
1. స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, శ్రీకాళహస్తి
2. స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, శ్రీశైలం డ్యామ్
3. కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, తనకల్లు
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం- 03-02-2025
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ- 02-03-2025
- హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం- 04-03-2025
- ఎంట్రన్స్ ఎగ్జామ్ తేదీ- 09-03-2025
- మెరిట్ జాబితా విడుదల - 25-03-2025
- మొదటి దశ కౌన్సెలింగ్ -11-04-2025
- రెండో దశ కౌన్సెలింగ్ -21-04-2025
ఎక్సలెన్స్ సంస్థల ప్రత్యేకతలు
- ఈ విద్యాసంస్థలలో రెగ్యులర్ IPE సిలబస్ తో పాటు ఇంటెన్సివ్ కోచింగ్ అందిస్తారు.
- IIT, NIT (JEE) & EAMCET కోసం మైక్రో ప్లాన్
- IPE, IIT, JEE (మెయిన్స్) & EAPCET కు వారం, నెలవారీ, క్యుములేటివ్, టెర్మినల్ & గ్రాండ్ పరీక్షలు
- స్టడీ మెటీరియల్, రిఫరెన్స్ పుస్తకాలు అందిస్తారు
- మంచి మౌలిక సదుపాయాల ప్రయోగశాల, లైబ్రరీ
- 24 గంటలు వ్యక్తిగత శ్రద్ధ, మార్గదర్శకత్వం, కౌన్సెలింగ్ అందిస్తారు.