APSSDC : డిగ్రీ, డిప్లొమా విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌ - భారీ జీతాల‌తో జ‌ర్మనీలో ఉద్యోగాలు..! ఇవిగో వివరాలు-apssdc inviting application mechatronics jobs in germany full details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Apssdc : డిగ్రీ, డిప్లొమా విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌ - భారీ జీతాల‌తో జ‌ర్మనీలో ఉద్యోగాలు..! ఇవిగో వివరాలు

APSSDC : డిగ్రీ, డిప్లొమా విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌ - భారీ జీతాల‌తో జ‌ర్మనీలో ఉద్యోగాలు..! ఇవిగో వివరాలు

HT Telugu Desk HT Telugu

ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ శుభవార్త చెప్పింది. డిగ్రీ, డిప్లొమా విద్యార్థుల‌కు జర్మనీలో ఉద్యోగాలను అవకాశాలను కల్పించనుంది. ఇందుకు డిగ్రీ, డిప్లోమా పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. అర్హులైన వారు…మార్చి 25లోపు దరఖాస్తు చేసుకోవాలి.

.భారీ జీతాల‌తో జ‌ర్మనీలో ఉద్యోగాలు...!

డిగ్రీ, డిప్లొమా విద్యార్థుల‌కు ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ గుడ్‌న్యూస్ చెప్పింది. భారీ జీతాల‌తో జ‌ర్మ‌నీలో ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేందుకు ముందుకు వ‌చ్చింది. నెల‌వారీ జీతం రూ.2.46 ల‌క్ష‌ల నుంచి రూ.3.40 ల‌క్ష‌లు వ‌ర‌కూ ఉంటుంది. జ‌ర్మ‌న్ లాంగ్వేజ్‌పై శిక్ష‌ణ ఇచ్చి, ఉద్యోగం క‌ల్పిస్తారు. దీనికి ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు మార్చి 25 ఆఖ‌రు తేదీగా నిర్ణ‌యించిన‌ట్లు ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ అధికారి ర‌వికృష్ణ యాద‌వ్ తెలిపారు.

జ‌ర్మ‌న్ లాంగ్వేజ్‌లో శిక్ష‌ణ‌, ప్లేస్‌మెంట్ కోసం మెకాట్రానిక్స్ కోర్సు, జర్మనీ భాషలో శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. దీనికి అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 25 లోగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభమైంది. శిక్ష‌ణ పూర్తి అయిన త‌రువాత వీసా ప్రాసెసింగ్ ఉంటుంది. అంతా రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోనే నియామ‌క ప్ర‌కియ జ‌రుగుతోంది.

అర్హ‌త‌లు:

డిగ్రీ, డిప్లొమాలో మెకాట్రానిక్స్‌, ఎల‌క్ట్రిక‌ల్ ఎన‌ర్జీ సిస్టమ్‌, ఇండ‌స్ట్రీయ‌ల్ ఇంజినీరింగ్ పూర్తి చేయటంతో పాటు 18 నుంచి 40 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు మ‌ధ్య గ‌ల‌వారై ఉండాలి. అలాగే ఆయా విభాగాల్లో క‌నీసం మూడు సంవ‌త్స‌రాల‌ అనుభ‌వం ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

శిక్ష‌ణ కాలం:

1. శిక్ష‌ణ ఆరు నెల‌ల పాటు ఉంటుంది.

2. ఏ1, ఏ2, బీ1 లెవ‌ల్ శిక్ష‌ణ ఉంటుంది.

3. శిక్ష‌ణ ఆఫ్‌లైన్‌లోనే ఉంటుంది.

4. విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంలో శిక్ష‌ణ నిర్వ‌హిస్తారు.

5. అయితే బీ1 లెవ‌ల్ శిక్ష‌ణ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో కూడా ఉంటుంది.

శిక్ష‌ణ పూర్తి చేసుకున్న వారికి జ‌ర్మ‌నీలో ఉద్యోగం క‌ల్పిస్తారు. నెల‌కు రూ.2,800 యూరో నుంచి 3,600 యూరోల (రూ.2.46 ల‌క్ష‌ల నుంచి రూ.3.40 ల‌క్ష‌లు) వ‌ర‌కూ వేత‌నం ఉంటుంది.మార్చి 25వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ కింది ప‌త్రాలు జ‌త చేయాల్సి ఉంటుంది….

1. పాస్‌పోర్టు కాపీ

2. ప‌దో త‌ర‌గ‌తి మార్కుల మెమో

3. డిగ్రీ, డిప్లొమా ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

4. అనుభ‌వ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

5. లైట్, హెవీ వెహిక‌ల్ లైసెన్సులు

6. రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు

రెసిడెన్షియ‌ల్ శిక్ష‌ణ‌తో పాటు ఉద్యోగానికి ఎంపికైన అభ్య‌ర్థుల‌కు వీసా, విమాన ఖ‌ర్చులు ఉద్యోగం క‌ల్పించే కంపెనీనే భ‌ర్తిస్తుంది. కంపెనీ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ సౌక‌ర్యం కూడా క‌ల్పిస్తారు. అయితే డాక్యుమెంట్ ఖ‌ర్చుల‌కు సుమారు రూ.30,000 వ‌ర‌కూ అభ్య‌ర్థి చెల్లించాల్సి ఉంటుంది. శిక్ష‌ణ పూర్తి చేసుకున్న అభ్య‌ర్థులు రెండు విడ‌తలుగా రూ.40,000 రీఫండబుల్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డిపాజిట్ మొత్తాన్ని జ‌ర్మనీ వెళ్లిన త‌రువాత‌ తిరిగి రీఫండ్ చేస్తారు.

ఇత‌ర వివరాల‌కు ఫోన్ నంబ‌ర్లు 9988853335, 8790118349ను సంప్ర‌దించాలి. ఈ నంబ‌ర్ల‌ను సంప్ర‌దించ‌డంతో అద‌న‌పు స‌మాచారం తెలుసుకోవ‌చ్చు. అలాగే ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవ‌చ్చు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

HT Telugu Desk