ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్జేసీ-2025 పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ aprs.apcfss.in లో తనిఖీ చేయవచ్చు. విద్యార్థులు తమ ఐడీ, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అయ్యి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీఆర్జేసీ పరీక్ష 25 ఏప్రిల్, 2025న నిర్వహించారు.
ఏపీలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 1425 సీట్లలో ప్రవేశానికి ఈ ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ పరీక్షను MPC/EET (ఇంగ్లీష్, గణితం, భౌతిక శాస్త్రం), BPC/CGT (ఇంగ్లీష్, భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం), MEC/CEC (ఇంగ్లీష్, గణితం, సామాజిక శాస్త్రం) అనే మూడు గ్రూపులకు నిర్వహించారు. ఈ పరీక్ష 150 మార్కులకు జరిగింది. ప్రతి విభాగానికి 50 మార్కులు ఉన్నాయి.
ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ/సీఈసీ వంటి ఇంటర్మీడియట్ కోర్సులకు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఏపీఆర్జేసీ పరీక్ష నిర్వహిస్తారు.
ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు మొదటి దశ కౌన్సెలింగ్ తేదీలు:
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఈ తేదీలు, షెడ్యూల్ మారవచ్చు.
🔹 73,993 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు
🔹 62,047 మంది విద్యార్థులు హాజరయ్యారు
🔹 గురుకుల సంస్థలలో 5వ తరగతి నుంచి 8వ తరగతి, ఇంటర్ & డిగ్రీలో 7,190 సీట్లు అందుబాటులో ఉన్నాయి
📍 ఫలితాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి: https://aprs.apcfss.in
సంబంధిత కథనం