ఉద్యోగ రాత పరీక్షలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. గత ఏడాది ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్ష తేదీలు ప్రకటించిన నేపథ్యంలో…. తాజాగా కొన్నింటి హాల్ టికెట్లను విడుదల చేసింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ డైరెక్టర్ (టౌన్ ప్లానింగ్) పరీక్ష హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ అసిస్టెంట్ డైరెక్ట్ పోస్టులకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో ఎగ్జామ్స్ జరుగుతాయి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) ఏప్రిల్ 28 తేదీన ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది.
ఇక సంబంధిత సబ్జెక్ట్ పేపర్స్ పరీక్షలు చూస్తే…. ఏప్రిల్ 28వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అంతేకాకుండా ఏప్రిల్ 29వ తేదీన ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరో పేపర్ ఎగ్జామ్ జరుగుతుంది.
అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కాలి. ఇక్కడ ఓటీపీఆర్ ఐడీతో పాటు పాస్ వర్డ్ ను ఎంట్రీ చేయాలి. లాగిన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
మరోవైపు అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ తో పాటు ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కు సంబంధించిన హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ అందుబాటులోకి తీసుకువచ్చింది. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ కు సంబంధించి ఎగ్జామ్ ( పేపర్ 1) ఏప్రిల్ 28వ తేదీన ఉంటుంది. సబ్జెక్ట్ పేపర్‌కు సంబంధించి ఏప్రిల్ 28వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.
ఇక ఏపీ ఫిషరీస్ సర్వీస్‌లో ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) ఏప్రిల్ 28 తేదీన ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. సబ్జెక్ట్ పేపర్స్‌కు సంబంధించి పేపర్ పరీక్షలను ఏప్రిల్ 30వ తేదీన నిర్వహిస్తారు.
ఈ నోటిఫికేషన్ల వివరాలన్నీ ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. వీటి హాల్ టికెట్లు కూడా ఇదే వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక లైబ్రేరియన్ ఇన్ మెడికల్ హెల్త్ సబార్డినేట్, దివ్యాంగ సంక్షేమశాఖలోని అసిస్టెంట్ డైరెక్టర్ పరీక్షల హాల్‌టికెట్లు ఏప్రిల్ 17వ తేదీన విడుదలయ్యాయి.
సంబంధిత కథనం