ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అలర్ట్ ఇచ్చింది. 2024లో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం ఎనిమిది నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు జరగనున్నాయి.
రాత పరీక్షల షెడ్యుల్ ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 30 వరకు నాలుగు రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఎనిమిది నోటిఫికేషన్‌ల పరీక్షలను విశాఖపట్నం, కృష్ణ, చిత్తూరు, అనంతపురం నాలుగు జిల్లాల్లోని కేంద్రాల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఐ. నరసింహమూర్తి తెలిపారు.
1. ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ అసిస్టెంట్ డైరెక్ట్ పోస్టులకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) ఏప్రిల్ 28 తేదీన ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. సబ్జెక్ట్ పేపర్స్‌కు సంబంధించి పేపర్-11 (టౌన్ ప్లానింగ్-1) ఏప్రిల్ 28వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. పేపర్-111 (టౌన్ ప్లానింగ్-11) ఏప్రిల్ 29వ తేదీన ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది.
2. మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీసులలో లైబ్రేరియన్లు పోస్టులకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) ఏప్రిల్ 28 తేదీన ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. సబ్జెక్ట్ పేపర్‌కు సంబంధించి పేపర్-11 (లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సర్వీస్) ఏప్రిల్ 27వ తేదీన ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది.
3. ఏపీ గిరిజన సంక్షేమ సేవలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) ఏప్రిల్ 28 తేదీన ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. సబ్జెక్ట్ పేపర్స్‌కు సంబంధించి పేపర్-11 ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. పేపర్-111 ఏప్రిల్ 30వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.
4. వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, ట్రాన్స్ జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్ సర్వీస్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) ఏప్రిల్ 28 తేదీన ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. సబ్జెక్ట్ పేపర్‌కు సంబంధించి పేపర్-11 ఏప్రిల్ 27వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.
5. ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్‌లో అసిస్టెంట్ కెమిస్ట్‌లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) ఏప్రిల్ 28 తేదీన ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. సబ్జెక్ట్ పేపర్స్‌కు సంబంధించి పేపర్-11 (కెమిస్ట్రీ-1) ఏప్రిల్ 28వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. పేపర్-111 (కెమిస్ట్రీ-11) ఏప్రిల్ 29వ తేదీన ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది.
6. ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీస్‌లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) ఏప్రిల్ 28 తేదీన ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. సబ్జెక్ట్ పేపర్‌కు సంబంధించి పేపర్-11 (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) ఏప్రిల్ 28వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.
7. ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్‌లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకలకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) ఏప్రిల్ 28 తేదీన ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. సబ్జెక్ట్ పేపర్‌కు సంబంధించి పేపర్-11 ఏప్రిల్ 29వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.
8. ఏపీ ఫిషరీస్ సర్వీస్‌లో ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) ఏప్రిల్ 28 తేదీన ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. సబ్జెక్ట్ పేపర్స్‌కు సంబంధించి పేపర్-11 (ఫిషరీస్ సైన్స్-1) ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. పేపర్-111 (ఫిషరీస్ సైన్స్-11) ఏప్రిల్ 30వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.