ఏపీపీఎస్సీ 2024లో విడుదల చేసిన పలు ఉద్యోగ నియామక నోటిఫికేషన్లలో భాగంగా ఇప్పటికే వ్రాత పరీక్షలు పూర్తయ్యాయి. ప్రశ్నాపత్రాల ప్రాథమిక కీలు కూడా విడుదలయ్యాయి. ఈ క్రమంలో ప్రాథమిక "కీ" పై అభ్యంతరాల స్వీకరణ ప్రారంభమైంది.
2024లో ఏపీపీఎస్సీ ద్వారా విడుదలైన ఏపీ ఫిషరీస్ సర్వీసెస్‌లో ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాల పరీక్షల ప్రాథమిక "కీ"పై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ సాయంతో ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను నమోదు చేయవచ్చు.
ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటస్టికల్ సబార్డినేట్ సర్వీస్‌లో 2024లో విడుదలైన అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షల ప్రాథమిక "కీ" అభ‌్యంతరాలు స్వీకరిస్తారు.
ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్‌లో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగ నియామక పరీక్ష "కీ" పై అభ్యంతరాలు స్వీకరణ విండో ఓపెన్ అయ్యింది.
ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగ నియామక పరీక్ష ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు.
ఏపీ టౌన్ ప్లానింగ్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాల పరీక్షలపై ప్రాథమిక కీలపై అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు.
ప్రాథమిక అభ్యంతరాల స్వీకరణ పూర్తైన తర్వాత తుది ఫలితాలను విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.
సంబంధిత కథనం