AP Group 2 Mains Hall Ticket 2025 : ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
APPSC Group 2 Mains Hall Ticket 2025 : ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 23వ తేదీన మెయిన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. మెయిన్స్ పరీక్షలకు హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులు… ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీన జరగనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతేడాది ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా… ఏప్రిల్ లో ఫలితాలను ప్రకటించారు. మొత్తం 92,250 మంది అభ్యర్థులు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు ఎంపికయ్యారు. వీరంతా కూడా మెయిన్స్ రాయనున్నారు.
గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్లు డౌన్లోడ్ ఇలా:
- ఏపీ గ్రూప్ 2 అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే గ్రూప్ II సర్వీసెస్ హాల్ టికెట్ ఆప్షన్ పై నొక్కాలి.
- OTPR ఐడీ, పాస్ వర్డ్ ను ఎంట్రీ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
ఏపీపీఎస్సీ ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గత నెల జనవరి 5న మెయిన్స్ ఎగ్జామ్ జరగాల్సి ఉంది. కానీ ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా పడింది. ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా.. మొత్తం 899 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకటన 2023 డిసెంబర్ లో జారీ అయింది.
గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా…. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17 శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ తెలిపింది. ఏపీలోని 26 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు.
గ్రూప్ 2 మెయిన్స్ లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయిస్తారు.
సంబంధిత కథనం