ఏపీ గ్రూప్ 1 ఫలితాలు వచ్చేశాయ్. ఈ మేరకు ఏపీపీఎస్సీ మంగళవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేసింది. జూన్ 23 నుంచి 30 వరకు ఇంటర్వ్యూలు జరగనున్నట్లు తెలిపింది.
మొత్తం 81 గ్రూప్ -1 పోస్టులకు గతేడాది మార్చి 17వ తేదీన ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. ఆ తర్వాత మెయిన్స్ పరీక్షలను నిర్వహించారు. ఇందుకు దాదాపు 4 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో అర్హత సాధించిన వారి ఫలితాలను ఏపీపీఎస్సీ తాజాగా వెల్లడించారు. వీరికి జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.
సంబంధిత కథనం