APPSC FRO Key 2025 : ఏపీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ 'కీ' విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి-appsc fro screening test initial answer key 2025 out direct link here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Appsc Fro Key 2025 : ఏపీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ 'కీ' విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

APPSC FRO Key 2025 : ఏపీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ 'కీ' విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

APPSC FRO Answer Key 2025 : ఎఫ్‌ఆర్‌ఓ స్క్రీనింగ్ టెస్ట్ ఆన్సర్‌ కీ విడుదలైంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ వివరాలను పేర్కొంది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కీపై ఏమైనా అభ్యరంతరాలు ఉంటే ఆన్‌లైన్‌ ద్వారా మార్చి 23వ తేదీ వరకు తెలపవచ్చు.

ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ కీ విడుదల

ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ స్క్రీనింగ్‌ పరీక్షకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రాథమిక కీలను విడుదల చేసింది. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రాథమిక కీలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మార్చి 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తెలియజేయవచ్చని ఏపీపీఎస్సీ పేర్కొంది. కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే వీటిని స్వీకరిస్తామని స్పష్టం చేసింది. ఈ ఎగ్జామ్ ను మార్చి 16న నిర్వహించిన సంగతి తెలిసిందే. అటవీశాఖలో 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి గత ఏడాది 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. మార్చి 16న పరీక్ష నిర్వహించారు.

FRO ప్రాథమిక కీని ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  1. పరీక్ష రాసిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. FRO Initial key స్క్రీనింగ్ టెస్ట్ లింక్ పై నొక్కాలి. ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది.
  3. ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే ప్రాథమిక కీ ఓపెన్ అవుతుంది.
  4. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ స్క్రీనింగ్‌ పరీక్షకు ప్రాథమిక కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు…

డీఈఓ మెయిన్స్ హాల్‌ టికెట్లు విడుదల:

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో భర్తీ చేయనున్న డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌ (డీఈఓ) పోస్టులకు సంబంధించిన హాల్‌ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. 2023 డిసెంబర్ 22న డీఈఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రిలిమ్స్‌ పరీక్షలు గత ఏడాది నిర్వహించారు. తాజాగా కంప్యూటర్ బేస్డ్‌ మెయిన్స్‌ పరీక్షను నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది.

  • మార్చి 26, 27 తేదీలలో డీఈఓ నియామక పరీక్షలను కంప్యూటర్ బేస్డ్‌ విధానంలో నిర్వహిస్తారు.
  • 26 వ తేదీ మధ్యాహ్నం రెండున్నర నుంచి 5 గంటల వరకు పేపర్ 1 పరీక్ష జరుగుతుంది.
  • 27వ తేదీ ఉదయం 9.30నుంచి 12 గంటల వరకు పేపర్‌ 2, 27వ తేదీ మధ్యాహ్నం రెండున్నర నుంచి 5 గంటల వరకు పేపర్ 3 పరీక్ష నిర్వహిస్తారు.
  • మెయిన్స్ హాల్‌ టిక్కెట్లు ఇప్పటికే కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్