ఏపీపీఎస్సీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ రిక్రూట్‌మెంట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండి ఇలా..-appsc fro hall tickets released download here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీపీఎస్సీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ రిక్రూట్‌మెంట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండి ఇలా..

ఏపీపీఎస్సీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ రిక్రూట్‌మెంట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండి ఇలా..

Sarath Chandra.B HT Telugu

ఏపీపీఎస్సీ ఫారెస్ట్‌ రేంజ్ ఆఫీసర్‌ ఉద్యోగ నియామకాలకు హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 2 నుంచి ఎఫ్‌ఆర్వో రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు జరుగనున్నాయి.

ఏపీపీఎస్సీ ఎఫ్‌ఆర్‌ఓ హాల్‌ టిక్కెట్ల విడుదల

ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి హాల్‌ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్‌ కార్యదర్శి రాజబాబు తెలిపారు. ఎఫ్‌ఆర్వో ప్రాథమిక పరీక్షలు మార్చి 16న జరిగాయి. అటవీశాఖలో 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి గత ఏడాది 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. మార్చి 16న పరీక్ష నిర్వహించారు.

ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ ఉద్యోగ నియామకాల్లో భాగంగా మెయిన్స్‌ రాత పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. హాల్‌ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.

ఏపీపీఎస్సీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఉద్యోగ నియామకాలలో భాగంగా హాల్‌ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఫారెస్ట్‌రేంజ్ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నవంబర్‌ 2024లో నోటిఫికేషన్‌ విడుదలైంది.

పరీక్షల నిర్వహణ ఇలా…

ఏపీపీఎస్సీ ఎఫ్‌ఆర్వో ఉద్యోగాలకు రాత పరీక్ష జూన‌ 2 నుంచి 4వ తేదీ వరకు జరుగుతాయి. పరీక్షలను ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్‌ విధానంలో నిర్వహిస్తారు.

జూన్‌ 2వ తేదీ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 4.10వరకు జనరల్ ఇంగ్లీష్‌, జనరల్ తెలుగులో క్వాలిఫైయింగ్ టెస్ట్‌ నిర్వహిస్తారు.

జూన్‌ 3వ తేదీన జనరల్ స్టడీస్‌, మెంటల్ ఎబిలిటీ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది.

జూన్‌ 3వ తేదీ మ‌ధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు వరకు పేపర్ 2 మ్యాథమెటిక్స్‌ పరీక్ష ఉంటుంది.

జూన్‌ 4వ తేదీ ఉదయం సెషన్‌లో పేపర్‌ 3 జనరల్ ఫారెస్ట్రీ పేపర్‌ 1 పరీక్ష ఉంటుంది.

జూన్ 4వ తేదీ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు పేపర్ 4 జనరల్ ఫారెస్ట్రీ పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు.

ఫారెస్ట్‌ రేజ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఇక్కడ క్లిక్‌ చేసి హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఉద్యోగ నియామకాల్లో కదలిక..

ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్షల్లో కదలిక వచ్చింది. ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్లకు పరీక్షల నిర్వహణకు కమిషన్ సిద్ధం అవుతోంది. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో చేపట్టిన ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్ల నియామక పరీక్షల్లో మెయిన్స్‌ పరీక్షలు ఆఫ్‌ లైన్‌లోనే నిర్వహిస్తారు. 37 పోస్టుల భర్తీకి గత మార్చిలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.

పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో స్క్రీనింగ్ పరీక్షలను కూడా ఆన్‌‌లైన్‌ పద్ధతిలో కంప్యూటర్ బేస్డ్‌ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. పాలనాపరమైన సౌలభ్యం కోసమే పరీక్షల్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్టు కార్యదర్శి వివరించారు. మెయిన్స్‌ నిర్వహణలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు.

ఇప్పటికే స్క్రీనింగ్ పరీక్ష ఆలస్యం..

ఏపీ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఇటీవల ఏపీపీఎస్సీ(APPSC) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కమిషన్‌ ఛైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా చేశారు. గత నెలలోనే కొత్త ఛైర్మన్‌ బాధ్యతలు స్వీకరించారు. పెండింగ్‌ పరీక్షల నిర్వహణపై దృష్టి సారించారు.

దాదాపు మొత్తం 37 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 15 నుంచి ఆన్ లైన్ అప్లికేషన్లు స్వీకరణ పూర్తైంది.మే నెల 15 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ లో అప్లై ( సంబంధిత సబ్జెట్ లో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెల రూ.48,400 వేల నుంచి రూ.1,37,220 లక్షల వరకు వేతనం ఉంటుంది. రాతపరీక్షలు, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 01.07.2024 నాటికి 18 - 30 సంవత్సరాల వయస్సులోపు అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులు వయో పరిమితి సడలింపు ఉంటుంది.

జోన్ల వారీగా పోస్టులు(FRO Posts)

జోన్ -I : 08 ఖాళీలు

జోన్ -II : 11 ఖాళీలు

జోన్ -III : 10 ఖాళీలు

జోన్ -IV : 08 ఖాళీలు

పోస్టుల కేటాయింపు : ఓసీ-14, బీసీ-12, ఈడబ్ల్యూఎస్-11 పోస్టులు

పరీక్ష విధానం ఇలా?

ఎఫ్ఆర్వో ప్రిలిమ్స్ (AP FRO Prelims)పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్-ఎ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, పార్ట్-బిలో జనరల్ ఫారెస్ట్రీ అంశాలు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తామని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

మెయిన్ పరీక్షను(AP FRO Mains) మొత్తం 600 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్స్ లో మొత్తం నాలుగు పేపర్లను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. వీటిల్లో ఒకటి క్వాలిఫైయింగ్ పేపర్ (జనరల్ ఇంగ్లిష్, జనరల్ తెలుగు) ఉంటుంది. మెయిన్స్ లో నెగెటివ్ మార్కులు(1/3) ఉంటాయి. మెయిన్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఓసీలకు 40, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 మార్కులు కనీస అర్హతగా నిర్ణయించారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం