అటవీశాఖలో ఖాళీల భర్తీ కోసం ఇటీవలే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలను కూడా నిర్వహించింది. అయితే వీటి ఫలితాలను ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను పేర్కొంది.
ఈ నోటిఫికేషన్లలో భాగంగా… అటవీ శాఖలో మొత్తం 435 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, 256 ఎఫ్‌బీఓ పోస్టులు, 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ తర్వాత మెడికల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియేన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత తుది ఫలితాలు వెల్లడిస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం