APPSC Exam Dates : ఏపీపీఎస్పీ కీల‌క అప్‌డేట్‌-పాలిటెక్నికల్‌, జూనియ‌ర్‌, డిగ్రీ కాలేజీల లెక్చర‌ర్ ప‌రీక్ష తేదీలు ప్రక‌టన-appsc exam dates announced polytechnic junior degree college lecturer exams scheduled ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Appsc Exam Dates : ఏపీపీఎస్పీ కీల‌క అప్‌డేట్‌-పాలిటెక్నికల్‌, జూనియ‌ర్‌, డిగ్రీ కాలేజీల లెక్చర‌ర్ ప‌రీక్ష తేదీలు ప్రక‌టన

APPSC Exam Dates : ఏపీపీఎస్పీ కీల‌క అప్‌డేట్‌-పాలిటెక్నికల్‌, జూనియ‌ర్‌, డిగ్రీ కాలేజీల లెక్చర‌ర్ ప‌రీక్ష తేదీలు ప్రక‌టన

HT Telugu Desk HT Telugu

APPSC Exam Dates : ఏపీపీఎస్సీ కీలక అప్ డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని పాలిటెక్నిక‌ల్, జూనియ‌ర్‌, డిగ్రీ కాలేజీల లెక్చర‌ర్ పోస్టుల‌కు ప‌రీక్షల తేదీల‌ను ప్రక‌టించింది. ప‌రీక్షల‌ను జూన్ 16వ తేదీ నుంచి నుంచి 26వ తేదీ వ‌ర‌కు ఏపీపీఎస్సీ నిర్వహించునుంది.

ఏపీపీఎస్పీ కీల‌క అప్‌డేట్‌-పాలిటెక్నికల్‌, జూనియ‌ర్‌, డిగ్రీ కాలేజీల లెక్చర‌ర్ ప‌రీక్ష తేదీలు ప్రక‌టన

APPSC Exam Dates : ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో పాలిటెక్నిక‌ల్, జూనియ‌ర్‌, డిగ్రీ కాలేజీల లెక్చర‌ర్ పోస్టుల‌కు ప‌రీక్షల తేదీల‌ను ప్రక‌టించింది. ప‌రీక్షల‌ను జూన్ 16వ తేదీ నుంచి నుంచి 26వ తేదీ వ‌ర‌కు నిర్వహించనుంది.

పోస్టులు

ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, జూనియ‌ర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, తిరుల‌మ తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) డిగ్రీ, జూనియ‌ర్ కాలేజీల్లో 464 లెక్చర‌ర్ పోస్టుల‌కు ప‌రీక్షల నిర్వహ‌ణ‌కు ఏపీపీఎస్సీ తేదీల‌ను ప్రక‌టించింది.

1. రాష్ట్రంలో ఏపీ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ స‌ర్వీస్ కింద‌ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ (ఇంజ‌నీరింగ్‌, నాన్ ఇంజ‌నీరింగ్‌)లో 99 లెక్చర‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు 2023 డిసెంబ‌ర్ 21వ తేదీన‌ నోటిఫికేష‌న్ ఇచ్చారు. 2024 జ‌న‌వ‌రి 29వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 18వ తేదీ రాత్రి 11.59 గంట‌ల వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించారు.

2. రాష్ట్రంలో ఏపీ ఇంట‌ర్మీడియ‌ట్ ఎడ్యుకేష‌న్ స‌ర్వీస్ కింది ప్రభుత్వ జూనియ‌ర్ కాలేజీలో 47 లెక్చర‌ర్ పోస్టుల భ‌ర్తీకి 2023 డిసెంబ‌ర్ 28వ తేదీన‌ నోటిఫికేష‌న్ ఇచ్చారు. 2024 జ‌న‌వ‌రి 31వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 20వ తేదీ రాత్రి 11.59 గంట‌ల వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించారు.

3. రాష్ట్రంలో ఏపీ కాలేజియేట్ ఎడ్యుకేష‌న్ స‌ర్వీస్ కింద‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 240 లెక్చర‌ర్ పోస్టుల భ‌ర్తీకి 2023 డిసెంబ‌ర్ 30వ తేదీన‌ నోటిఫికేష‌న్ ఇచ్చారు. 2024 జ‌న‌వ‌రి 24వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 13వ తేదీ రాత్రి 11.59 గంట‌ల వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించారు.

4. టీటీడీ డిగ్రీ, జూనియ‌ర్ కాలేజీల్లో 78 లెక్చర‌ర్ పోస్టుల భ‌ర్తీకి 2023 డిసెంబ‌ర్ 31వ తేదీన‌ నోటిఫికేష‌న్ ఇచ్చారు. ఇందులో డిగ్రీ కాలేజీ లెక్చర‌ర్ పోస్టులు 49, ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీ లెక్చ‌ర‌ర్ పోస్టులు 29 భ‌ర్తీ చేస్తున్నారు. ఢిల్లీ కాలేజీ లెక్చర‌ర్లకు జీతాలు రూ.61,960 నుంచి రూ.1,51,370 వ‌ర‌కు ఉంటాయి. అలాగే ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీ లెక్చర‌ర్లకు జీతాలు రూ.57,100 నుంచి రూ.1,47,760 వ‌ర‌కు ఉంటాయి.

ఈ పోస్టుల భ‌ర్తీ చేసేందుకు రాత ప‌రీక్ష (అబ్జెటివ్ టైప్‌లో కంప్యూట‌ర్ టెస్ట్) జూన్ 16 నుంచి జూన్ 26 వ‌ర‌కు నిర్వహించ‌నున్నారు. అందులో జూన్ 20 నుంచి 22 వ‌ర‌కు ప‌రీక్షలు ఉండ‌వు. పూర్తి వివ‌రాల కోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/WEBNOTE_TTD(DL_JL_OL)_132023_162023_172023_21032025.pdf ను క్లిక్ చేసి చూడొచ్చు.

రాత ప‌రీక్ష‌ల‌కు సంబంధించి హాల్ టిక్కెట్లు త్వర‌లోనే విడుద‌ల చేస్తారు. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లోనే హాల్ టిక్కెట్లు విడుద‌ల చేస్తారు. అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

HT Telugu Desk

సంబంధిత కథనం