APPSC DEO Hall Tickets: ఏపీపీఎస్సీ డీఈఓ హాల్‌ టిక్కెట్ల విడుదల, మార్చి 26 నుంచి పరీక్షలు-appsc deo hall tickets released exams from march 26 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Appsc Deo Hall Tickets: ఏపీపీఎస్సీ డీఈఓ హాల్‌ టిక్కెట్ల విడుదల, మార్చి 26 నుంచి పరీక్షలు

APPSC DEO Hall Tickets: ఏపీపీఎస్సీ డీఈఓ హాల్‌ టిక్కెట్ల విడుదల, మార్చి 26 నుంచి పరీక్షలు

Sarath Chandra.B HT Telugu

APPSC DEO Hall Tickets: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ఆధ్వర్యంలో ప్రకటించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించి పరీక్షకు హాల్ టిక్కెట్లను కమిషన్‌ విడుదల చేసింది. గత ఏడాది జూన్‌లో ప్రిలిమ్స్‌ పరీక్షల్ని నిర్వహించారు.

ఏపీపీఎస్సీ డీఈఓ హాల్‌ టిక్కెట్ల విడుదల

APPSC DEO Hall Tickets: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో భర్తీ చేయనున్న డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌ (డీఈఓ) పోస్టులకు సంబంధించిన హాల్‌ టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. 2023 డిసెంబర్ 22న డిఈఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రిలిమ్స్‌ పరీక్షలు గత ఏడాది నిర్వహించారు. తాజాగా కంప్యూటర్ బేస్డ్‌ మెయిన్స్‌ పరీక్షను నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది.

మార్చి 26, 27 తేదీలలో డిఈఓ నియామక పరీక్షలను కంప్యూటర్ బేస్డ్‌ విధానంలో నిర్వహిస్తారు. 26 వ తేదీ మధ్యాహ్నం రెండున్నర నుంచి 5 గంటల వరకు పేపర్ 1 పరీక్ష జరుగుతుంది.

27వ తేదీ ఉదయం 9.30నుంచి 12 గంటల వరకు పేపర్‌ 2, 27వ తేదీ మధ్యాహ్నం రెండున్నర నుంచి 5 గంటల వరకు పేపర్ 3 పరీక్ష నిర్వహిస్తారు.

హాల్‌ టిక్కెట్లు ఇప్పటికే కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు హాల్‌ టిక్కెట్లను డౌన్‌ లోడ్‌ చేసుకుని అందులో ఉన్న సూచనల్ని అవగతం చేసుకోవాలి. పరీక్ష కేంద్రానికి కేవలం హాల్‌ టిక్కెట్ మాత్రమే తీసుకువెళ్లాలి. సూచనల భాగాన్ని తీసుకెళ్లకూడదు. చివరి నిమషంలో రద్దీలో చిక్కుకోకుండా పరీక్ష కేంద్రాలను ముందుగానే పరిశీలించుకోవాలని కమిషన్ సూచించింది.

ఏపీపీఎస్సీ హాల్‌ టిక్కెట్లను కమిషన్‌ వెబ్‌ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు…

ఏపీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీఈవో) ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని 38 డీఈవో పోస్టులకు గత ఏడాది మే 25 రాత పరీక్ష నిర్వహించారు. ఈ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఏపీపీఎస్సీ జూన్‌లో విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు 1:1000 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. మొత్తం 3,957 మంది అభ్యర్థుల మెయిన్స్ కు అర్హత సాధించారు. మెరిట్ జాబితాను ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో https://portal-psc.ap.gov.in/ లో అందుబాటులో ఉంటారు.

రాష్ట్రంలోని 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు 2023 డిసెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 25న సీబీడీ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ www.psc.ap.gov.in విడుదల చేశారు. మెయిన్ పరీక్షలను త్వరలో నిర్వహిస్తున్నారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం