APPSC Recruitment Exams : 8 ఉద్యోగ నోటిఫికేషన్లు - పరీక్ష తేదీలను ప్రకటించిన ఏపీపీఎస్సీ, షెడ్యూల్ వివరాలివే
APPSC Recruitment Exam Dates : ఉద్యోగ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన 8 ఉద్యోగ నోటిఫికేషన్ల రాత పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఏప్రిల్ 27 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్ ను విడుదల చేసింది.
ఉద్యోగ నియామక రాత పరీక్షలకుపై ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. గతంలో విడుదల చేసిన ఎనిమిది నోటిఫికేషన్ల రాత పరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఏప్రిల్ 27 నుంచి ప్రారంభమై.. 30వ తేదీతో ముగుస్తాయని పేర్కొంది. ఆన్ లైన్ లో ఈ పరీక్షలు ఉంటాయని వెల్లడించింది.
- ఏప్రిల్ 28 -30 -2025 : అసిస్టెంట్ డైరెక్టర్, ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ ఉద్యోగాలు.
- ఏప్రిల్ 28 -30-2025 : లైబ్రేరియన్, మెడిక్ అండ్ హెల్త్ సబ్ అర్డినేట్ సర్వీస్.
- ఏప్రిల్ 28 -30-2025 : అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్.
- ఏప్రిల్ 28 -30 -2025 : అసిస్టెంట్ డైరెక్టర్, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ.
- ఏప్రిల్ 28 - 30 -2025 : అసిస్టెంట్ కెమిస్ట్ - గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్.
- ఏప్రిల్ 28 -30-2025 : అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టర్.
- ఏప్రిల్ 28 -30-2025 : అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్.
- ఏప్రిల్ 28 -30 -2025 : ఫిషరీస్ డెవలప్ మెంట్ ఆఫీసర్
పైన పేర్కొన్న నోటిఫికేషన్ ఉద్యోగాల పరీక్షలు ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ తేదీన కేవలం జనరల్ స్టడీస్ (పేపర్ -1) మాత్రమే ఉంటుంది.
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక సబ్జెక్ట్ కు సంబంధించిన పేపర్ - 2… ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో జరుగుతాయి. ఇందులో కొన్ని ఉదయం సెషన్, మరికొన్ని పేపర్లు మధ్యాహ్నం సెషన్ లో జరుగుతాయి. కొన్ని నోటిఫికేషన్లకు మూడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో చూడొచ్చు. ఈ రాత పరీక్షల కోసం విశాఖపట్నం, కృష్ణా, చిత్తూరు, అనంతపురం జిల్లాలను సెంటర్లుగా ఎంపిక చేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.
ఇక ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ రాత పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 5న నిర్వహించాల్సిన ఈ పరీక్షను ఫిబ్రవరి 23కు రీషెడ్యూల్ చేశారు. అంటే వచ్చే నెల 23వ తేదీన గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాసే అవకాశం ఉంది. త్వరలోనే హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
సంబంధిత కథనం