APPSC Group 1 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల, మే 3 నుంచి 9 వరకు పరీక్షలు-appsc announced group 1 main exams schedule may 3 to 9th exams held ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Appsc Group 1 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల, మే 3 నుంచి 9 వరకు పరీక్షలు

APPSC Group 1 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల, మే 3 నుంచి 9 వరకు పరీక్షలు

Bandaru Satyaprasad HT Telugu
Jan 21, 2025 07:21 PM IST

APPSC Group 1 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదలైంది. మే 3 నుంచి 9 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల, మే 3 నుంచి 9 వరకు పరీక్షలు
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల, మే 3 నుంచి 9 వరకు పరీక్షలు

APPSC Group 1 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ వెల్లడించింది.

yearly horoscope entry point

ఏపీపీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ తేదీలు

(ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 01.00 వరకు)

  • 03.05.2025 - తెలుగు(క్వాలిఫైయింగ్ పేపర్)
  • 04.05.2025 -ఇంగ్లీష్ పేపర్ (క్వాలిఫైయింగ్ పేపర్)
  • 05.05.2025 -పేపర్-I - జనరల్ ఎస్సే(సమకాలీన అంశాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు)
  • 06.05.2025 - పేపర్-II - భారతదేశ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సాంస్కృతిక, భౌగోళిక శాస్త్రం
  • 07.05.2025 - పేపర్-III - పాలిటిక్స్, రాజ్యాంగం, పాలన, లా అండ్ ఎథిక్స్
  • 08.05.2025 -పేపర్-IV - భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, డెవలప్మెంట్
  • 09.05.2025 -పేపర్-V- సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు

గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షను డిస్క్రిప్టివ్ టైప్‌లో నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. క్వశ్చన్ పేపర్ ను ట్యాబ్‌ల్లో ఇవ్వాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 81 గ్రూప్‌ -1 పోస్టుల భర్తీకి గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ కు మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4,496 మంది మెయిన్స్‌ పరీక్షకు క్వాలిఫై అయ్యారు.

మెయిన్స్ పరీక్ష విధానం

ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలో మొత్తం 5 ప్రధాన పేపర్లు ఉంటాయి. వీటితో పాటు తెలుగు, ఇంగ్లిష్ క్వాలిఫై పేపర్లు ఉంటాయి. మొత్తం 5 పేపర్లలో ఒక్కో పేపర్ కు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ నిర్వహించనున్నారు. మెయిన్స్ లో అర్హత సాధించిన వారికి 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొత్తం 825 మార్కులకు మెయిన్స్ నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ కు 180 నిమిషాలు కేటాయించారు. డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్స్ నిర్వహిస్తారు.

ఏపీ ఆర్‌టీజీఎస్‌ లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటేరియ‌ట్‌లో ఉండే రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్‌టీజీఎస్‌)లో ఉద్యోగాల‌ను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుదలైంది. మొత్తం 66 పోస్టులను భ‌ర్తీ చేస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు జ‌న‌వ‌రి 25 ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు. ఆ ఉద్యోగాల‌ను ఏడాది కాలప‌రిమితితో భ‌ర్తీ చేస్తున్నారు. ప‌నితీరు ఆధారంగా కాంట్రాక్టు వ్య‌వ‌ధి పెంచే అవ‌కాశం ఉంది. 66 ఉద్యోగాల‌కు అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత ఉన్నవారు త‌మ రెజ్యూమ్‌ను మెయిల్ చేసి అప్లై చేసుకోవ‌చ్చు.

పోస్టుల వివరాలు

మొత్తం 66 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఆర్‌టీజీఎస్‌-2, ఎవేర్ హ‌బ్‌-3, ఆర్‌టీజీఎస్ అడ్మినిస్ట్రేష‌న్‌-7, డేటా ఇంటిగ్రేష‌న్ అండ్ అన‌లిటిక్స్ హ‌బ్‌-8, ప్రొడెక్ట్ డ‌వ‌ల‌ప్‌మెంట్ హ‌బ్‌-6, ఏఐ అండ్ టెక్ ఇన్నోవేష‌న్ హ‌బ్‌-10, పీపుల్ ప‌ర్సెప్ష‌న్ హ‌బ్‌-20, మ‌ల్టీ సోర్స్ విజువ‌ల్ ఇంటెలిజెన్స్ హ‌బ్‌ విభాగంలో 10 పోస్టులు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం