Visakhapatnam Port Authority : విశాఖపట్నం పోర్టులో అప్రెంటిస్ ఖాళీలు - ఇలా దరఖాస్తు చేసుకోండి
Visakhapatnam Port Authority Apprentices: అప్రెంటిస్ ఖాళీల భర్తీకి విశాఖపట్నం పోర్టు అథారిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 20 ఖాళీలు ఉన్నాయి. ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుంది. అర్హులైన వారు జనవరి 18వ తేదీలోపు ఆన్ లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ)లో అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 20 ఖాళీలు ఉన్నాయి. ఏడాది పాటు ట్రైనింగ్ ఉంటుంది. https://www.apprenticeshipindia.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.
ట్రేడ్లు వారీగా పోస్టులు:
1. వెల్డర్ - 4 పోస్టులు
2. ఎలక్ట్రిషియన్ -4 పోస్టులు
3. ఫిట్టర్ -4 పోస్టులు
4. మోటర్ మెకానిక్ - 4 పోస్టులు
5. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 4 పోస్టులు
అర్హతలు..
1. వెల్డర్ - ఐటీఐ వెల్డర్ ఉత్తీర్ణత సాధించాలి.
2. ఎలక్ట్రిషియన్ - ఐటీఐ ఎలక్ట్రికల్ ఉత్తీర్ణత సాధించాలి.
3. ఫిట్టర్ -4 - ఐటీఐ ఫిట్టర్ ఉత్తీర్ణత సాధించాలి.
4. మోటర్ మెకానిక్ - ఐటీఐ మోటర్ మెకానిక్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
5. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - ఐటీఐ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఉత్తీర్ణత సాధించాలి.
నెలవారీ స్టైఫండ్ వివరాలు:
- వెల్డర్ - రూ.8,344.60
- ఎలక్ట్రిషియన్ -రూ.9,387.67
- ఫిట్టర్ -రూ.9,387.67
- మోటర్ మెకానిక్ - రూ.9,387.67
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - రూ.9,387.67
2024 డిసెంబర్ 31 నాటికి అభ్యర్థుల వయసు కనీసం 14 ఏళ్లు పూర్తి అవ్వాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేస్తారు. అయితే అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, తమ శిక్షణ పూర్తి చేసిన తరువాత వారికి ఉపాధి కల్పించడానికి విశాఖపట్నం పోర్టు అథారిటీ బాధ్యత వహించదు.
అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఐటీఐలో వచ్చి మార్కుల మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. విశాఖపట్నం పోర్టు అథారిటీ పిల్లలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు పిలుస్తారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువటి టీఏ, డీఏలు ఇవ్వరు.
అప్లికేషన్ ప్రాసెస్ ఇలా…
అధికారిక వెబ్‌సైట్ https://www.apprenticeshipindia.gov.in/ లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తొలిత ఆ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ అప్పటికే రిజిస్ట్రార్ అయి ఉంటే,"click and search 0pportunity" చేయాలి. అందులో ట్రేడ్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత సెలెక్ట్ కోర్సు, సెలెక్ట్ లోకేషన్ (ఆంధ్రప్రదేశ్) అని క్లిక్ చేయాలి. అందులో విశాఖపట్నం పోర్టు అథారిటీ అని క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం