సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ 2024 దరఖాస్తు ఫామ్ సమర్పించడానికి తేదీ దగ్గరపడుతుంది. ఇప్పటి వరకు చేయకనివారు వెంటనే చేసేయాలి. మీరు ఇంకా అప్లికేషన్ ఫామ్ నింపకపోతే, csirnet.nta.ac.in అధికారిక వెబ్‌సైట్ వెళ్లి అప్లికేషన్ నింపాలి. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్, డిసెంబర్ 2024 కోసం దరఖాస్తు ఫారాన్ని సమర్పించడానికి ఎన్టీఏ చివరి తేదీని 2024 డిసెంబర్ 30గా నిర్ణయించింది. చివరి తేదీ తర్వాత అభ్యర్థుల దరఖాస్తు ఫారం స్వీకరించరు.
సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామ్ డిసెంబర్ 2024 సెషన్ కోసం దరఖాస్తు ప్రక్రియను ఎన్టీఏ 2024 డిసెంబర్ 9 నుంచి ప్రారంభించింది. సీఎస్ఐఆర్ నెట్ పరీక్ష ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు జరగనుంది. జనవరి 1, 2 తేదీల్లో ఫారంలో దిద్దుబాట్లు చేసుకోవచ్చు. అంటే ఎడిట్ విండో ఇస్తారు. జేఆర్ఎఫ్, యూనివర్సిటీస్(ఎల్ఎస్)లో అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్‌డీ పోస్టుల భర్తీకి సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది.
సీఎస్ఐఆర్ నెట్‌లో 5 పేపర్లు ఉంటాయి. 1. కెమికల్ సైన్సెస్, ఎర్త్, 1. అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, 3. లైఫ్ సైన్సెస్, 4. ఫిజికల్ సైన్సెస్, 5. మ్యాథమెటికల్ సైన్సెస్
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1150గా దరఖాస్తు ఫీజు ఉంది. ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ వికలాంగులు/థర్డ్ జెండర్ వారికి రూ.325గా నిర్ణయించారు. ఫీజును నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేదా యూపీఐ ద్వారా ఆన్లైన్లో చెల్లించవచ్చు.
అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్, దివ్యాంగులు, మహిళలకు 5 ఏళ్లు, ఓబీసీ (నాన్ క్రీమీలేయర్)కు 3 ఏళ్ల వరకు వయోపరిమితి పొడిగింపు ఉంటుంది. అయితే లెక్చరర్షిప్ (ఎల్ఎస్) లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితి లేదు.
ఒక అభ్యర్థి కేవలం ఒక దరఖాస్తు ఫారాన్ని మాత్రమే నింపడానికి అనుమతి ఉంటుంది. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు ఫారాలను సమర్పిస్తే వారి దరఖాస్తు ఫారం చెల్లదు. దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులకు ఏవైనా సమస్యలు ఎదురైతే హెల్ప్‌లైన్ డెస్క్ నంబర్ 011-69227700 లేదా 011-40759000కు కాల్ చేయవచ్చు. లేదా csirnet@nta.ac.in ఎన్టీఏకు ఈమెయిల్ చేయవచ్చు.