RIMC Admissions: రాష్ట్రీయ ఇండియన్‌ మిలటరీ కాలేజీలో 8వ తరగతిలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోండి ఇలా..-apply for admissions to 8th class at rashtriya indian military college like this ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Rimc Admissions: రాష్ట్రీయ ఇండియన్‌ మిలటరీ కాలేజీలో 8వ తరగతిలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోండి ఇలా..

RIMC Admissions: రాష్ట్రీయ ఇండియన్‌ మిలటరీ కాలేజీలో 8వ తరగతిలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోండి ఇలా..

RIMC Admissions: మిలటరీ కాలేజీల్లో 8వ తరగతిలో ప్రవేశాల కోసం డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన బాలబాలికలు ఈ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే మిలటరీ కాలేజీలో తరగతులు జరుగుతాయి.

రాష్ట్రీయ ఇండియన్ మెడికల్ కాలేజీలో ప్రవేశాలకు నోటిఫికేషన్

RIMC Admissions: రాష్ట్రీయ మెడికల్ కాలేజీలో ఎనిమిదో తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన బాలబాలికలు ఈ డెహ్రాడూన్‌లోని మిలటరీ కాలేజీలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా రెండు సార్లు ఇందులో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. 2026 జనవరి టర్మ్‌ కోసం తాజా నోటిఫికేషన్ విడుదలైంది.

దరఖాస్తు చేయడం ఇలా...

రాష్ట్రీయ మిలిటరీ కాలేజీలో ప్రవేశాల కోసం 11 నుంచి 13ఏళ్లలోపు వయసు ఉన్న వారు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 2026 జనవరి 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయసు మించకూడదు. 2013 జనవరి 2 నుంచి 2014 జూలై 1వ తేదీ మధ్య కాలంలో పుట్టిన వారు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు...

ఆర్‌ఐఎంసీలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేయడానికి జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.600ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.555 చెల్లించాలి. ఈ మేరకు జాతీయ బ్యాంకుల్లో డీడీ తీయాల్సి ఉంటుంది. రాతపరీక్షతో పాటు వైవా, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 2025జూన్ 1వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు.

నిర్ణీత రుసుముతో తీసిన డీడీని దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది.డీడీలను ఆర్‌ఐఎంసీకి పోస్టులో పంపితే దరఖాస్తుతో పాటు ప్రాస్పెక్టస్, పాత ప్రశ్నాపత్రాలను అభ్యర్థులకు స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా పంపుతారు. పూర్తి చేసిన దరఖాస్తులను అయా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు పంపాలి. తెలంగాణ వారు టీజీపీఎస్సీకి, ఏపీ అభ్యర్థులు ఏపీపీఎస్సీకి పంపాల్సి ఉంటుంది.

దరఖాస్తు గడువు..

పూర్తి చేసిన దరఖాస్తులను మార్చి 31వ తేదీలోగా సంబంధిత పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు చేరేలా పంపాల్సి ఉంటుంది. ఈలోపు డీడీలను ఆర్‌ఐఎంసీకి పంపి దరఖాస్తులు పొందాల్సి ఉంటుంది.

రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైవా 50 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 400 మార్కులకు వైవా జరుగుతుంది. రాత పరీక్షను పూర్తిగా డిస్క్రిప్టివ్‌గా నిర్వహిస్తారు. ప్రశ్న-జవాబు తరహాలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అందులో అర్హత సాధిస్తే వైవా నిర్వహిస్తారు. దీనికి 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వైవా తర్వాత మెడికల్ టెస్ట్‌ క్లియర్ చేయాల్సి ఉంటుంది.

పరీక్షా కేంద్రాలు...

తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీలో ప్రవేశ పరీక్షను హైదరాబాద్‌, విజయవాడలలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ నిర్వహిస్తాయి. ఆర్‌ఐఎంసీలో చదివిని వారికి ఎన్‌డిఏలో ప్రాధాన్యత లభిస్తుంది. మరిన్ని వివరాలకు https://rimc.gov.in/rimcindex.aspx లో చూడండి.

కావాల్సిన పత్రాలు...

అభ్యర్థులు బర్త్‌ సర్టిఫికెట్‌, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్‌ సర్టిఫికెట్, ఆధార్‌ కార్డ్, డొమెస్టిక్/ రెసిడెన్స్ సర్టిఫికెట్‌, ప్రస్తుతం చదివే స్కూల్‌ నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్‌, రెండు పాస్ పోర్ట్‌ సైజ్ ఫోటోలు అందుబాటులో ఉంచుకోవాలి.