తెలంగాణ ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో అడ్మిషన్లు - ఎంపికైన వారికి అప్రెంటిస్‌గా ఛాన్స్..! ఇలా అప్లయ్ చేసుకోండి-applications invited for for admissions in telangana rtc iti colleges ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణ ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో అడ్మిషన్లు - ఎంపికైన వారికి అప్రెంటిస్‌గా ఛాన్స్..! ఇలా అప్లయ్ చేసుకోండి

తెలంగాణ ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో అడ్మిషన్లు - ఎంపికైన వారికి అప్రెంటిస్‌గా ఛాన్స్..! ఇలా అప్లయ్ చేసుకోండి

ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌, వరంగల్ లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లోని వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నెల 21వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలని సూచించింది.

ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలు

తెలంగాణ ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్ ల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా హైదరాబాద్ తో పాటు వరంగల్ లో ఉన్న కాలేజీలో ప్రవేశాలను కల్పిస్తారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఆన్ లైన్ దరఖాస్తులకు జూన్ 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

అప్రెంటీషిస్ గా ఛాన్స్ - ఎండీ సజ్జనార్

మోటార్‌ మెకానిక్‌ వెహికిల్‌, మెకానిక్‌ డిజిల్‌, వెల్డర్‌, పెయింటర్‌ ట్రెడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్‌ ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిస్ సౌకర్యం సంస్థ కల్పిస్తుందని ఎండీ సజ్జనార్ తెలిపారు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీలోపు https://iti.telangana.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.

స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ ఒక మంచి అవకాశమని సజ్జనార్ వివరించారు. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్‌ అందించడంతో పాటు తక్కువ వ్యవధిలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలలను టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్‌ లోని హాకీంపేట, వరంగల్ ములుగు రోడ్ లోని ఐటీఐ కళాశాలలను నేరుగా కూడా సంప్రదించవచ్చన్నారు.

అకడమిక్ మెరిట్ తో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. దరఖాస్తులు రుసుం కింద రూ. 100 చెల్లించాలి. ఆన్ లైన్ దరఖాస్తులో వివరాలను నమోదు చేసే సమయంలో ఎలాంటి తప్పులు చేయవద్దు.ముఖ్యమైన పత్రాలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి. ముఖ్యంగా సరైన మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం