APCOB Recruitment 2025 : ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగ ఖాళీలు - ఇలా దరఖాస్తు చేసుకోండి-applications invited for assistant manager jobs in the district cooperative central bank ltd guntur in ap ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Apcob Recruitment 2025 : ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగ ఖాళీలు - ఇలా దరఖాస్తు చేసుకోండి

APCOB Recruitment 2025 : ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగ ఖాళీలు - ఇలా దరఖాస్తు చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 10, 2025 02:02 PM IST

AP Co operative Bank Recruitment 2025 : ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా.. 31 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు
ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు

గుంటూరులోని ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 31 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన వారు… ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 22వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

yearly horoscope entry point

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు…. గుర్తింపు పొందిన యునివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. కామర్స్ అభ్యర్థులు….55 శాతం మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి. ఇంగ్లీష్ తో పాటు తెలుగు భాషపై ప్రావీణ్యం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

దరఖాస్తు విధానం….

అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్‌ అభ్యర్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు జనవరి 22వ తేదీతో పూర్తవుతుంది. ఫిబ్రవరి 2025లో రాత పరీక్ష ఉంటుంది.  గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేస్తారు.

ఎంపిక విధానం…

దరఖాస్తు చేసుకునే వారికి ఆన్ లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్ లోనే ఉంటుంది. వంద మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. తప్పుడు సమాధానానికి 0.25 కోత విధిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు, రీజనింగ్ 35, Quantitative Aptitude నుంచి 35 మార్కులు ఉంటాయి.

ముఖ్య వివరాలు:

  • ఉద్యోగ ప్రకటన - ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, గుంటూరు.
  • ఉద్యోగాలు - అసిస్టెంట్ మేనేజర్
  • ఉద్యోగ ఖాళీలు - 31
  • గుర్తింపు పొందిన యునివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్
  • దరఖాస్తులకు చివరి తేదీ - 22 జనవరి 2025.
  • పరీక్షలు - ఫిబ్రవరి 2025
  • అధికారిక వెబ్ సైట్ - https://apcob.org/careers/
  • ఆన్ లైన్ లింక్ - https://ibpsonline.ibps.in/dccbmarc24/

Whats_app_banner

సంబంధిత కథనం